దళిత ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు ఏ ప్రజాప్రతినిధికి కూడా ఇలా కావద్దని అన్నారు. పోలీసు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. ప్రోటోకాల్ పాటించని అధికారులను పిలిచి విచారణ చేస్తానని స్పీకర్ చెప్పారు.
న్యూస్ లైన్ డెస్క్: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం జరగడంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందించారు. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు స్పీకర్‌ను వేముల వీరేశం, దళిత ఎమ్మెల్యేల బృందం కలిసిన విషయం తెలిసిందే. ఇటీవల భువనగిరిలో జరిగిన ప్రోటోకాల్ వివాదంలో పోలీసులు వీరేశంను గుర్తుపట్టలేదు. సభ లోపలికి ఆయనను అనుమతించలేదు.
దీంతో వీరేశం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మమ్మల్ని గుర్తు పట్టని పోలీసులు మాకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు ఏ ప్రజాప్రతినిధికి కూడా ఇలా కావద్దని అన్నారు. పోలీసు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. ప్రోటోకాల్ పాటించని అధికారులను పిలిచి విచారణ చేస్తానని స్పీకర్ చెప్పారు.
తాజగా, ఈ అంశంపై స్పందించిన స్పీకర్.. వేముల వీరేశంకు ఇటువంటి చేదు అనుభవం ఎదురవ్వడం దురదృష్టకరమని అన్నారు. గౌరవ శాసన సభ్యుల హక్కులకు, గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా శాసనసభ నియమాల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.