Viral Video:పవన్ సిగ్గులేని వెదవ అనే వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి..!

శ్రీరెడ్డి  ఒక స్టార్ హీరోయిన్ కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ఈమెకు కూడా అంత ఫాలోయింగ్ ఉంది. అలాంటి శ్రీరెడ్డి  నటీనటులను తిడుతూ వారిపై రకరకాల కామెంట్స్ చేస్తూ చాలా ఫేమస్ అయింది.


Published Jul 27, 2024 08:36:27 AM
postImages/2024-07-27/1722087370_sree.jpg

న్యూస్ లైన్ డెస్క్: శ్రీరెడ్డి  ఒక స్టార్ హీరోయిన్ కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ఈమెకు కూడా అంత ఫాలోయింగ్ ఉంది. అలాంటి శ్రీరెడ్డి  నటీనటులను తిడుతూ వారిపై రకరకాల కామెంట్స్ చేస్తూ చాలా ఫేమస్ అయింది. ఇండస్ట్రీలోని వారిని కాకుండా రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు బయట పెడుతూ  సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారుతుంది. శ్రీ రెడ్డి ముందు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని తప్పకుండా ఎత్తి చూపుతుంది.

https://x.com/SriReddyTalks/status/1816788819342959008?s=19

అలా శ్రీరెడ్డి  ఇటీవల ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తూనే వస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను   ఎత్తి పొడుస్తూ ఒక వీడియో తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్త  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. శ్రీరెడ్డి తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ లో పవన్ కళ్యాణ్ పైన ఒక వీడియో షేర్ షేర్ చేయడంతో పవన్ అభిమానులంతా శ్రీరెడ్డిని తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే  గతంలో నాడు నేడు, అమ్మ ఒడి, దీవెనలు, కానుకలు అంటూ.. ఇలా ఎన్నో పథకాల పేర్లను ఆయన నోటికొచ్చినట్లు పెట్టుకున్నారు. మామ వస్తున్నాడు అంటూ చెప్పండి..  పలక బలకం పట్టుకొని అఆ ఇఈ రాస్తే కాదు, సంక్షేమ పథకాలు మేము ఆపివేయబోం మళ్లీ కొనసాగిస్తాం.

ఏపీ ప్రజలకు  పది రూపాయలు   ఎక్కువగానే ఇవ్వాలనుకుంటున్నాము తప్ప తక్కువ చేయలేం. అంటూ పవన్ కళ్యాణ్ ఆ వీడియోలో మాట్లాడుతున్నాడు. అలాగే ఆ వీడియోలో పవన్ ను సిగ్గులేని వెధవ అనే వాయిస్ కూడా వినిపిస్తుంది. ఈ విధంగా పవన్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను కట్ చేసి వీడియోగా తయారుచేసి శ్రీరెడ్డి పోస్ట్ చేయడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నేటిజన్స్  కొంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయగా, మరి కొంతమంది శ్రీరెడ్డిని దారుణంగా తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : chandrababu pawankalyan janasena tdp news-line sreereddy

Related Articles