ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అతిలోక సుందరిగా మంచి పేరుతో ఓ వెలుగు వెలిగింది అందాల ధ్రువతార శ్రీదేవి. ఈమె తెలుగు,తమిళం, మలయాళం, హిందీ ఇలా ఎన్నో భాషల్లో నటించి తనకు ఎవరూ సాటి లేరు అనిపించుకుంది. అలాంటి శ్రీదేవి నిర్మాత బోని కపూర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇందులో పెద్దమ్మాయి పేరు జాన్వి కపూర్ అవగా రెండవ కూతురు పేరు ఖుషి కపూర్.
న్యూస్ లైన్ డెస్క్: ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అతిలోక సుందరిగా మంచి పేరుతో ఓ వెలుగు వెలిగింది అందాల ధ్రువతార శ్రీదేవి. ఈమె తెలుగు,తమిళం, మలయాళం, హిందీ ఇలా ఎన్నో భాషల్లో నటించి తనకు ఎవరూ సాటి లేరు అనిపించుకుంది. అలాంటి శ్రీదేవి నిర్మాత బోని కపూర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇందులో పెద్దమ్మాయి పేరు జాన్వి కపూర్ అవగా రెండవ కూతురు పేరు ఖుషి కపూర్.
వీరిద్దరిని శ్రీదేవి దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచారు. ఇద్దరు అమ్మాయిలు కూడా శ్రీదేవిని మించిన అందంతో ఉంటారు. అయితే ఇద్దరు కూతుర్ల సినీ ఎంట్రీ చూడకముందే శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించింది. అలాంటి శ్రీదేవికి చాలామంది ఇద్దరు కూతుర్లు మాత్రమే ఉన్నారు అనుకుంటారు. కానీ ఆమెకు మూడవ కూతురు కూడా ఉందని చాలామందికి తెలియదు. కానీ శ్రీదేవికి మూడవ కూతురు ఉందట. ఆమె పేరే సజల్ అలీ. శ్రీదేవి చివరిగా నటించినటువంటి మామ్ మూవీలో ఈమె శ్రీదేవికి కూతురుగా నటించింది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య తల్లి కూతుర్ల బంధం అనేది బలపడిందట.
అంతేకాకుండా ఈ సమయంలోనే సజల్ తల్లి కూడా మరణించిందట. దీంతో ఎంతో డిప్రెషన్ లోకి వెళ్ళిన సజల్ కు శ్రీదేవి బాసటగా నిలిచి సొంత తల్లి కంటే ఎక్కువ చూసుకుందట. అంతేకాదు ఇక నుంచి సజల్ కు నేను తల్లిని సజల్ నాకు మూడవ బిడ్డ అంటూ చెప్పుకొచ్చిందట. ఈ విధంగా శ్రీదేవి,సజల్ మధ్య విపరీతమైన బాండింగ్ ఏర్పడిందని తెలుస్తోంది. శ్రీదేవి మరణించిన తర్వాత సజల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడితే ఎమోషనల్ అయింది. మా సొంత తల్లి మరణించిన తర్వాత మరో తల్లిని శ్రీదేవిలో చూసుకున్నానని చెప్పుకొచ్చింది. నా రెండవ అమ్మని కూడా దేవుడు దూరం చేశాడని బాధపడింది.