ఆల్మట్టి డ్యాం నుంచి 3లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 3లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు 3లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది.
న్యూస్ లైన్, హైదరాబాద్: ఎగవున కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర, కృష్ణా నుంచి దాదాపు 4లక్షల 32వేల క్యూసెకుల వరద వచ్చి చేరుతోంది. దాదాపు రోజుకు 40 టీఎంసీల నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 882 అడుగులు కాగా ప్రస్తుతం 870 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు మొత్తం స్టోరీజి 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 145 టీఎంసీలకు చేరింది. పై నుంచి భారీగా వస్తున్న వరదతో రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం వరకు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. దీంతో ఎల్లుండి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
ఆల్మట్టి డ్యాం నుంచి 3లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 3లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు 3లక్షలకు పైగా క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 3,16,308 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. అటూ తుంగభద్ర నుంచి 1,58,457 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. ఈ రెండు కలిపి దాదాపు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరదగా వస్తున్నాయి. అటూ శ్రీశైలం నుంచి ప్రస్తుతం 74వేల 258 క్యూసెక్కల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.