india: మార్క్ జుకర్ బర్గ్ , స్టీవ్ జాబ్స్ అందరు దర్శించే బాబా ఈయనే !

భారత్ ఆధ్యాత్మికతకు నెలవు. కైంచి థామ్ ఆశ్రమం ..భారతీయులకే కాదు ...ప్రపంచ దేశాలందరికి భారత్ లో కరోలీ బాబా అంటే చాలా నమ్మకం


Published Oct 16, 2024 05:54:00 PM
postImages/2024-10-16/1729081480_0151.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: భారత్ ఆధ్యాత్మికతకు నెలవు. కైంచి థామ్ ఆశ్రమం ..భారతీయులకే కాదు ...ప్రపంచ దేశాలందరికి భారత్ లో కరోలీ బాబా అంటే చాలా నమ్మకం . కైంచి ధామ్ ఆశ్రమాన్ని సందర్శించిన తర్వాతనే స్టీవ్ జాబ్స్ యాపిల్‌ కంపెనీని పెట్టడంపై  దృష్టి పెట్టాడని చెబుతారు. అంతేకాదు మార్క్ జుకర్ బర్గ్ లాంటి ప్రముఖులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన టెన్షన్ అన్నీ ఈ కరోలీ బాబా చెంతనే అధిగమించారు. 


ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్,యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కి భారత్ లోని ఓ ఆలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది. తన వృత్తి పరంగా చాలా టెన్షన్ ఉన్నపుడే ఈ కైంచి థామ్ ను సందర్శించారు. నీమ్ కరోలీ బాబా అనే సాధువు స్థాపించిన ఓ ఆశ్రమంలో కరోలీ బాబాను హనుమాన్ గా కొలుస్తారు. ఆయన అంశే ఇక్కడ ఉందని భావించి పూజిస్తారు.  కైంచీ థామ్ లో మానసిక సాంత్వన కలుగుతుంది. అక్కడి నుంచి వెళ్లినతర్వాత ఇఖ ఫేస్ బుక్ లో వచ్చి ప్రతి సమస్యను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారట.


అంతేకాదు 2015లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం..ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆయనని కలిసిన  మార్క్ జుకర్‌బర్గ్.. తనకు భారత్ లో ప్రత్యేక అనుబంధం ఉన్న ఆలయం గురించి మోదీతో చెప్పారు. ఈ ఆశ్రమం నుంచి వెళ్లాక తన సంస్థను కొనడానికి చాలా మంది ఎగబడ్డారట. వ్యక్తిగతంగాను ఒత్తిడి దూరమైంది. అప్పట్నుంచి  నేను నిత్యం నీమ్ కరోలీ బాబాను తలచుకొని హనుమాన్ చాలీసా చదువుతాను. ఏడాదికి రెండు సార్లు ఆశ్రమానికి రాకపోతే నాకు శక్తి రాదనిపిస్తుందంటు చెప్పుకొచ్చారు స్టీవ్ జాబ్స్.


 కైంచి ధామ్ నైనిటాల్‌లో ఉన్న బాబా నీమ్ కరౌలి ఆశ్రమం. ఇది హనుమాన్ దేవాలయం,ఆశ్రమం. దీనిని 1960లలో నీమ్ కరోలి బాబా నిర్మించారు. ఈ ఆశ్రమం చుట్టూ కొండలు, చెట్లు, నది ఉన్నాయి. 1973లో నీమ్ కరోలి బాబా మరణించారు. కానీ నేటికీ చాలా మంది ఉన్నత స్థాయి అమెరికన్లకు కూడా ఆయనను విశ్వసిస్తారు.
 

newsline-whatsapp-channel
Tags : news-line face-book mark devotional

Related Articles