దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ప్రారంభమయ్యేటపుడు బాగా బూస్టింగ్ గా పెరిగింది. కాని చివరికి మాత్రం నష్టాల్లో ముగిసిం
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. ప్రారంభమయ్యేటపుడు బాగా బూస్టింగ్ గా పెరిగింది. కాని చివరికి మాత్రం నష్టాల్లో ముగిసింది.ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. చివరకు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయింట్లు కోల్పోయి 81,820కి పడిపోయింది. నిఫ్టీ 70 పాయింట్లు నష్టపోయి 25,057కి దిగజారింది. దీని ఎఫెక్ట్ రేపు బంగారం అమ్మకాలపై ..డాలర్ విలువ పై పడే అవకాశం ఉంది.
ఐసీఐసీఐ బ్యాంక్ (1.90%), భారతి ఎయిర్ టెల్ (1.26%), ఏసియన్ పెయింట్స్ (1.01%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.83%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.76%) గా ఉంది. బజాజ్ ఫైనాన్స్ , టాటా స్టీల్ , జేఎస్ డబ్యూ స్టీల్ , టాటా మోటర్స్ లాంటివి భయంకరమైన నష్టాలు చవిచూశాయి.