పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుధ్ తెల్లవారుజామున పాము కాటుకు గురయ్యాడు. అస్వస్థతగా కనిపించడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో సర్కారు హాస్టళ్ల పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోంది. హాస్టల్ ఫుడ్ తిన్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి దవాఖానాల పాలవుతుంటే.. ఏకంగా ప్రాణాలే కోల్పోయిన ఘటన జగిత్యల జిల్లాలో జరిగింది. మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో తెల్లవారుజామున అస్వస్థతకు గురైన విద్యార్థి హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే మృతి చెందడం కలకలం రేపింది.
పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుధ్ తెల్లవారుజామున పాము కాటుకు గురయ్యాడు. అస్వస్థతగా కనిపించడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మరో విద్యార్థి మోక్షిత్ సైతం అస్వస్థతకు గురి కాగా హుటాహుటిన దవాఖానాకు తరలించారు. గత నెల 26న ఇదే హాస్టల్లో ఓ విద్యార్థి పాము కాటుకు బలయ్యాడు. పాముకాటు ఇప్పటికే ఒక విద్యార్థి ప్రాణాలు పోయినా అధికారులు చర్యలు తీసుకోలేదని.. అప్పుడే తగు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇప్పుడు మరో ప్రాణం పోయి ఉండేది కాదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్టల్లలో పిల్లలను ఎలా చదివించాలంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాముకాటుతో మృతి చెందిన అనిరుధ్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మరో విద్యార్థి మోక్షిత్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.