అనారోగ్యం కారణంగా శనివారం సాయంత్రం ఆమె చెన్నై కావేరీ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.
న్యూస్ లైన్ డెస్క్: గానకోకిల సుశీల మంగళవారం ఉదయం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా శనివారం సాయంత్రం ఆమె చెన్నై కావేరీ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.
కాగా, గత మూడు రోజులుగా హాస్పిటల్లోనే చికిత్స పొందిన ఆమె.. ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. హాస్పిటల్ నుంచి ఆరోగ్యంగా సంతోషంగా పంపించారని అన్నారు.