NEWYORK: న్యూయార్క్ లో ఆలయంపై దాడి..ఖండించిన ప్రజాప్రతినిధులు!

ప్రధాని మోదీ ఈ నెల 22న ప్రసంగించబోతున్న వేదికకు 28 కి.మీ దూరంలో ఈ దేవాలయం ఉంది. మెలివిల్లిలో ఉన్న స్వామినారాయణ్ ఆలయాన్ని ధ్వంసం చేయడం ఆమోదించదగ్గ చర్యకాదు అని భారత కౌన్సులేట్ ఓ ప్రకటన లో తెలిపింది.


Published Sep 20, 2024 10:31:00 AM
postImages/2024-09-20/1726808805_Screenshot20240920103611.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : న్యూయార్క్ లో హిందూ ఆలయంపై దాడి అమెరికాలోని మెల్విల్లేలో ఉన్న బీఏపీఎస్ స్వామి నారాయణ్ ఆలయంపై దాడిని భారత్ తో పాటు అమెరికా ప్రజాప్రతినిధులు కూడా ముక్త కంఠంతో ఖండించారు. ఇది చాలా నీచమైన చర్యఅని  ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది.ఈ దేవాలయానికి వెళ్లే మార్గంలోఅర్థరహితమైన రాతలు రాసినట్లు తెలుస్తున్నది. ప్రధాని మోదీ ఈ నెల 22న ప్రసంగించబోతున్న వేదికకు 28 కి.మీ దూరంలో ఈ దేవాలయం ఉంది. మెలివిల్లిలో ఉన్న స్వామినారాయణ్ ఆలయాన్ని ధ్వంసం చేయడం ఆమోదించదగ్గ చర్యకాదు అని భారత కౌన్సులేట్ ఓ ప్రకటన లో తెలిపింది.


ఈ చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అంతే కాదు అమెరికా ప్రతినిధులు 25 మంది ముక్త కంఠంతో ఈ దాడులను సహించబోమని తెలిపారు. ఈ దేశంలో హింసకు తావు లేదని తెలిపారు. ఆల‌యంపై జ‌రిగిన దాడి ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టాల‌ని హిందూ అమెరికా ఫౌండేష‌న్ పేర్కొన్న‌ది. హిందూ ఆల‌యంపై దాడి చేయ‌డం అంటే పిరికిపంద చ‌ర్యే అని హిందూ అమెరిక‌న్ ఫౌండేష‌న్ ఎడిట‌ర్ సుహాగ్ శుక్లా తెలిపారు.నిజానికి ఈ దాడి ఖలిస్తానీ ఉగ్రవాది గురుపర్వత్ సింగ్ పన్నూ చేసినట్లు సమాచారం.


హిందువులు, భార‌తీయ సంస్థ‌ల‌పై దాడులు చేస్తామ‌ని ఇటీవ‌ల ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది గురుప‌ర్వ‌త్ సింగ్ ప‌న్నూ హెచ్చ‌రిక‌లు చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిందే ఈ చర్య . అయితే మోదీ ప్రసంగానికి వెళ్లే దారిలోనే ఈ పిచ్చి రాతలు రాసి దాడులకు పాల్పడ్డారని క్లారిటీ ఇచ్చింది న్యూయార్క్ అధికారులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu attack america temples

Related Articles