Tamil actor: సీనియర్ యాక్టర్ ఢిల్లీ గణేష్ ఇక లేరు !

ఢిల్లీ గణేశ్ తెలుగు సినిమాల్లోను నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మల్టీ లాంగ్వేజ్ ల్లో సినిమాలు చేస్తూ దాదాపు 400 లకు పైగా సినిమాల్లో నటించారు. 


Published Nov 10, 2024 11:30:00 AM
postImages/2024-11-10/1731218530_WhatsAppImage20241110at9.32.44AM696x392.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ శనివారం కన్నుమూశారు. వయోభారంతో కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం రాత్రి తుదిశ్వాస వదలారని కుటుంబసభ్యులు తెలిపారు. తమిళ నటుడు అయిన ఢిల్లీ గణేశ్ తెలుగు సినిమాల్లోను నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మల్టీ లాంగ్వేజ్ ల్లో సినిమాలు చేస్తూ దాదాపు 400 లకు పైగా సినిమాల్లో నటించారు. 


చివరిసారిగా కమల్ హాసన్ సినిమా ‘భారతీయుడు -2’ లో నటించారు. ఎన్నో సీరియల్స్ తో పాటు వెబ్ సీరిస్ లను కూడా నటించి ఆఖరి వరకు సినిమాల్లో నటించారు. అయితే నిన్న రాత్రి ఆయన తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ గణేశ్ మృతిపై తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అంత్యక్రయలు ఏర్పాటుచేస్తున్నారు.
సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఢిల్లీ గణేశ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

 

దాదాపు పదేళ్లు భారత వైమానిక దళంలో ఆయన సేవలందించారు. మొదటి సినిమా కె. బాలచందర్ దర్శకత్వంలో నిర్మించిన తమిళ సినిమా పట్టిన ప్రవేశం లో నటించారు. 1977 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1977 లో విడుదలైన ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ‘జైత్రయాత్ర’, ‘నాయుడమ్మ’, ‘పున్నమినాగు’ తదితర సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. 1994 లో తమిళనాడు ప్రభుత్వం ఢిల్లీ గణేశ్ ను కలైమామణి అవార్డు తో సత్కరించింది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tamilanadu kamalhasan

Related Articles