ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన రద్దు అయినట్లు సమాచారం
న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన రద్దు అయినట్లు సమాచారం. అమెరికా నుంచి అర్ధాంతరంగా సీఎం రేవంత్ తిరిగొస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా పర్యటన ఆకస్మిక రద్దుపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. టీపీసీసీలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో హుటాహుటిన వెనక్కి కారణం ఎంటీ అని చర్చించుకుంటున్నారు. ఈ నెల 15న టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం పావులు కదులుతున్నాయి. దీంతో యూఎస్ నుంచి 12వ తేదీన నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. వస్తూనే హైకమాండ్‌తో భేటీ కాబోతుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.