గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ములుగు జిల్లా పర్యటనలో అపశ్రతి చోటు చేసుకుంది.
న్యూస్ లైన్ డెస్క్: గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ములుగు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. ఈ పర్యటనలో భద్రత కోసం విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్ పాముకాటుకు గురయ్యారు. వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్టు చేశారు. కాగా, విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ పాముకాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో హుటాహుటున కానిస్టేబుల్‌ను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం వైద్యులు వరంగల్‌కు సిఫార్సు చేశారు. మంగళవారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో కలెక్టరేట్‌లో 25 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన రచయితలు, కళాకారులతో సమావేశమై మధ్యాహ్నం భోజనం చేశారు. ఇక ఆ తర్వాత రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఇక సరస్సును సందర్శించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను సందర్శించి పూజలు నిర్వహించనున్నారు.