1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన.. 2018 నుంచి 2023 వరకు త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. డిప్యూటీ సీఎంగానే కాకుండా బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా కూడా సేవలందించారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నిమయమించారు. తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీచేశారు. ఇందులో భాగంగానే తెలంగాణ గవర్నర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ(66)ను నియమించారు. తెలంగాణకు ఇన్‌చార్జ్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్రను గవర్నర్‌గా నియమించారు.
1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన.. 2018 నుంచి 2023 వరకు త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. డిప్యూటీ సీఎంగానే కాకుండా బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా కూడా సేవలందించారు.
కాగా, రాజస్థాన్‌కు హరి బౌ, సిక్కింకు ఓం ప్రకాష్ మాతూర్, జార్ఖండ్ గవర్నర్‌గా సంతోష్ కుమార్, మేఘాలయకు సి.హెచ్.విజయశంకర్, మహారాష్ట్రకు సీపీ రాధాకృష్ణన్, అస్సాంకు లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యలను గవర్నర్లుగా నియమిస్తూ ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.