Awards:జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగోల్ల సత్తా..!

ప్రతి ఏడాది  కేంద్ర ప్రభుత్వం జాతీయ చిత్ర అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే ఈసారి 70వ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది.  ఈ తరుణంలో తెలుగు ఇండస్ట్రీలోని చాలా సినిమాలకు


Published Aug 16, 2024 03:55:30 PM
postImages/2024-08-16/1723803930_awards.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రతి ఏడాది  కేంద్ర ప్రభుత్వం జాతీయ చిత్ర అవార్డులను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే ఈసారి 70వ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది.  ఈ తరుణంలో తెలుగు ఇండస్ట్రీలోని చాలా సినిమాలకు అందులో నటించిన నటీనటులకు  మంచి అవార్డులు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  జ్యూరీ సభ్యులు , కొరియోగ్రాఫర్లు, ఉత్తమ చిత్రాలు,  వివిధ కేటగిరీలకు చెందిన అవార్డులను తాజాగా బయట పెట్టింది. ఇందులో ముఖ్యంగా సౌత్ చిత్రాల హీరో, హీరోయిన్లు కూడా అవార్డులు అందుకోవడం  గమనార్హం.

 ముఖ్యంగా ఉత్తమ తెలుగు చిత్రంగా నిఖిల్ హీరోగా చేసినటువంటి కార్తికేయ 2 కు అవార్డు దక్కింది. అంతేకాకుండా ఉత్తమ  నటుడిగా కాంతర చిత్రంలో నటించినటువంటి రిషబ్ శెట్టికీ అవార్డు దక్కింది. అంతేకాకుండా  యష్ హీరోగా చేసినటువంటి కేజీఎఫ్ 2 చిత్రానికి కూడా అవార్డు గెలుచుకుంది. అంతేకాకుండా ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మోహరు అనే మూవీకి కూడా అవార్డు లభించింది. అంతేకాకుండా ఉత్తమ నటి నటులుగా నిత్యామీనన్ నటనకు కూడా అవార్డు దక్కడం గమనార్హం.  

మీరే కాకుండా తెలుగులో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా తిరుచ్చిట్రాంబలం చిత్రానికి గాను కొరియోగ్రఫీగా చేసినటువంటి జానీ మాస్టర్ కు ఈ అవార్డు దక్కింది. వీరే కాకుండా  సౌత్ లో ఉండేటువంటి  చాలామంది స్టార్లు ఈ పురస్కారాల్లో వారి టాలెంట్ గా చూపించారు. ఇందులో ముఖ్యంగా తెలుగు ఉత్తమ చిత్రంగా సీతారామం, బలగం, కార్తికేయ 2 చిత్రాలు తీవ్రంగా పోటీపడ్డాయట. కానీ చివరికి కార్తికేయ2కు అవార్డు వరించింది. ఇక ఉత్తమ నటులుగా రిషబ్ శెట్టితో పాటుగా 12 మంది నటులు  కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : news-line karthikeya-2 sitharamam national-film-awards rishab-shetty

Related Articles