ఆ స్టార్ హీరోయిన్ మళ్ళీ  ప్రెగ్నెంట్..మరీ ఇంత స్పీడ్ ఏంటమ్మా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ అయినటువంటి కాజల్, ప్రణీత, నయనతార పెళ్లిళ్లు చేసుకొని త్వరగా పిల్లలకు జన్మనిచ్చారు. ఇందులో నయనతార ఇద్దరు కవలలకు జన్మనివ్వగా కాజల్ ఒక అబ్బాయికి జన్మనిచ్చింది.  అంతేకాకుండా ప్రణీత కూడా ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఈమె పాప పుట్టి రెండు సంవత్సరాలు కూడా గడవకముందే మరోసారి ప్రెగ్నెంట్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె  బేబీ బంప్ తో ఉన్నటువంటి ఫోటోలు షేర్ చేయడంతో  సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.


Published Jul 25, 2024 01:22:18 AM
postImages/2024-07-25/1721884574_pranita1243.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ అయినటువంటి కాజల్, ప్రణీత, నయనతార పెళ్లిళ్లు చేసుకొని త్వరగా పిల్లలకు జన్మనిచ్చారు. ఇందులో నయనతార ఇద్దరు కవలలకు జన్మనివ్వగా కాజల్ ఒక అబ్బాయికి జన్మనిచ్చింది.  అంతేకాకుండా ప్రణీత కూడా ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఈమె పాప పుట్టి రెండు సంవత్సరాలు కూడా గడవకముందే మరోసారి ప్రెగ్నెంట్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె  బేబీ బంప్ తో ఉన్నటువంటి ఫోటోలు షేర్ చేయడంతో  సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

"ఏం పిల్లో ఏం పిల్లడో" అనే మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రణీత ఆ తర్వాత అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, రభస, వంటి ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గర అయింది.  అలాంటి ఈ ముద్దుగుమ్మ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే 2021లో వ్యాపారవేత్త అయినటువంటి నితిన్ రాజును వివాహం చేసుకుంది. 2022 జూన్ లో వీరికి ఒక పాప కూడా పుట్టింది. అంతేకాదు ఆ పాపకు సంబంధించిన పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మనందరిని అలరించిన ప్రణీత మరోసారి బేబీ బంప్ తో కనిపించి ఆశ్చర్యపరుస్తోంది.

పెళ్లయి రెండు సంవత్సరాలు కూడా గడవకముందే  మరోసారి ప్రెగ్నెంట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో మరి ఇంత స్పీడ్ ఏంటమ్మా ప్రణీత రెండు సంవత్సరాలకి ఇద్దరిని కంటావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆమె సోషల్ మీడియాలో తన బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేస్తూ "రౌండ్ 2..  ఇక ఈ ప్యాంట్స్ నాకు ఫిట్ అవ్వవుఅంటూ" క్యాప్షన్ ఇచ్చింది. దీంతో కొంతమంది నెటిజన్లు వీడేంట్రా ఇంత స్పీడున్నాడు, క్రికెట్ టీంని ఏమైనా కంటావా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kajal-agarwal pregnant pranitha nithin-raj

Related Articles