చాలామంది హీరోయిన్లు పెళ్లికి ముందు తల్లి అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం వెరైటీగా పెళ్లికి నెల రోజుల ముందు డేటింగ్ చేసి ఆ డేటింగ్ లో ప్రెగ్నెంట్ కావడంతో వెంటనే పెళ్లిని అనౌన్స్ చేసేసింది. అయితే
న్యూస్ లైన్ డెస్క్: చాలామంది హీరోయిన్లు పెళ్లికి ముందు తల్లి అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం వెరైటీగా పెళ్లికి నెల రోజుల ముందు డేటింగ్ చేసి ఆ డేటింగ్ లో ప్రెగ్నెంట్ కావడంతో వెంటనే పెళ్లిని అనౌన్స్ చేసేసింది. అయితే అప్పటికప్పుడే సంచలనం నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది ఈమె అభిమానులు కూడా షాక్ అయ్యారు. అసలు ఈమె ఎప్పుడు ప్రేమించింది ఎప్పుడు డేటింగ్ చేసింది.. పెళ్లిని ఇంత తొందరగా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది..పెళ్లయిన వెంటనే ఎలా తల్లయ్యింది అంటూ ఎంతోమంది అనుమానాలు వ్యక్తం చేశారు.
అయితే ఆ హీరోయిన్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నేను పెళ్లికి ముందే కాస్త తొందరపడ్డాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్.ఇక అమలాపాల్ అంటే కేవలం కోలీవుడ్ కి మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈమె తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో, ఎస్ఎంఎస్ వంటి కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అలాంటి అమలాపాల్ ముందుగా దర్శకుడు కేఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరి మధ్య బంధం రెండు సంవత్సరాలు కూడా నిలబడలేదు. అలా విడాకులు తీసుకున్నాక చాలా రోజులు ఒంటరిగా ఉండి ఆ తర్వాత తన స్నేహితుడు జగత్ దేశాయ్ తో ప్రేమలో ఉందట.
అయితే ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెట్టలేదు. ఇక ప్రేమలో ఉన్న వెంటనే డేటింగ్ చేసిన నెల రోజుల్లోనే అమలాపాల్ తల్లయ్యిందట. అయితే ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన వెంటనే ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అలా అనూహ్యంగా లవ్ వార్తలు వైరల్ అయిన వెంటనే వీరు పెళ్లి చేసుకున్నారు.ఇక పెళ్లయిన కొద్ది రోజులకే తల్లి అవుతున్నాను అంటూ అనౌన్స్ చేసింది.
దాంతో అమలాపాల్ పెళ్ళికి ముందు తల్లయ్యిందని అందరూ అనుకున్నారు.అయితే ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అమలా పాల్ మాట్లాడుతూ..నా మొదటి పెళ్లి చెడిపోయాక చాలా రోజులు బాధపడ్డాను. అయితే మొదటి పెళ్లి జరిగిన సమయంలో ఎంతగానో నష్టపోయాను. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేశాను.కానీ నా భర్త జగత్ నన్ను ఆ ఆలోచనల నుండి బయట పడేసి తన ప్రేమలో పడేశాడు. ఆ తర్వాత డేటింగ్ చేసిన వెంటనే ప్రెగ్నెంట్ అవ్వడంతో భర్త నిర్ణయాన్ని కాదనలేక వెంటనే పెళ్లి చేసుకున్నాను అంటూ అమలాపాల్ చెప్పుకొచ్చింది. ఇక రీసెంట్ గా వీరికి ఇలై అనే కొడుకు కూడా పుట్టాడు