Raghavendra Rao: మందు తాగి రాఘవేంద్ర రావుని కొట్టిన హీరో.?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన దర్శకత్వంతో ఎంతోమంది హీరో హీరోయిన్లను స్టార్స్ గా చేసిన దర్శకులలో రాఘవేంద్రరావు ఒకరు.అయితే అలాంటి ఈయన డైరెక్షన్లో ఒక్క సినిమాలోనైనా చేయాలి అనుకుంటారు


Published Aug 01, 2024 10:57:58 PM
postImages/2024-08-01//1722533278_ragavendraraorajashekar.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఏంటి స్టార్ డైరెక్టర్ అయిన రాఘవేంద్రరావుని ఓ హీరో మద్యపానం సేవించి కొట్టారా..ఇంతకీ ఆ హీరో ఎవరు.. అంత పెద్ద డైరెక్టర్ పై ఎందుకు చేయి చేసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో తన దర్శకత్వంతో ఎంతోమంది హీరో హీరోయిన్లను స్టార్స్ గా చేసిన దర్శకులలో రాఘవేంద్రరావు ఒకరు.అయితే అలాంటి ఈయన డైరెక్షన్లో ఒక్క సినిమాలోనైనా చేయాలి అనుకుంటారు చాలామంది హీరో హీరోయిన్లు.

అయితే అలాంటిది ఓ హీరో మాత్రం ఈయనని ఫుల్ గా తాగేసి కొట్టారట. అంతేకాదు ఆ హీరోని పాపులర్ చేసింది కూడా రాఘవేంద్ర రావే.. అలాంటిది ఆయన్ని కొట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని మీరు అనుకుంటారు.ఇక అసలు విషయం ఏమిటంటే.. రాఘవేంద్రరావుని తాగి కొట్టిన హీరో ఎవరో కాదు యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్.. రాజశేఖర్ భార్య హీరోయిన్ జీవిత చెల్లి ఓ రోజు హైదరాబాద్ వచ్చిన సమయంలో రాఘవేంద్రరావు ఆమెను చూసి సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్టు రాజశేఖర్ కి ఓ హీరోయిన్ చెప్పుడు మాటలు చెప్పిందట.

అంతేకాదు మీ మరదల్ని రాఘవేంద్రరావు సినిమాల పేరుతో వాడుకోవాలని చూస్తున్నాడని ఎక్కించి చెప్పిందట.దాంతో ఆవేశంలో మద్యం తాగిన రాజశేఖర్ వెంటనే రాఘవేంద్రరావు ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేశారట.అంతేకాదు ఆయన మీదికి గొడవకి వెళ్లడంతో మీడియా వాళ్ళు రాఘవేంద్రరావు ని కొట్టారని వార్తలు రాశారు. కానీ అసలు తప్పు రాజశేఖర్ దేనని ఆ తర్వాత బయటపడింది.

ఎందుకంటే ఓ హీరోయిన్ రాఘవేంద్రరావు మీద ఉన్న ఇష్టం తో జీవిత రాఘవేంద్రరావు తో సన్నిహితంగా ఉంటుంది అనే కోపంతో రాజశేఖర్ కి రాఘవేంద్ర రావు కి మధ్య గొడవ పెట్టించిందట. కానీ ఆ తర్వాత తప్పు తెలుసుకొని రాజశేఖర్, జీవితలు తప్పయింది క్షమించమని రాఘవేంద్రరావుని బతిమిలాడినా కూడా ఆయన క్షమించినట్టే క్షమించి ఆ తర్వాత అది మనసులో పెట్టుకున్నారట. ఇక ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్, జీవిత లు చెప్పుకొని బాధపడ్డారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood rajashekar jeevitha raghavendrarao

Related Articles