అనంత్ రాధిక మర్చంట్ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇండియా నుంచి బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ విధంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అలాంటి ఈ పెళ్లిలో ఆ హీరోయిన్ చాలా హైలెట్ అయిందట.
న్యూస్ లైన్ డెస్క్: అనంత్ రాధిక మర్చంట్ గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇండియా నుంచి బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ విధంగా అనంత్ అంబానీ రాధిక మర్చంట్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అలాంటి ఈ పెళ్లిలో ఆ హీరోయిన్ చాలా హైలెట్ అయిందట.
వేడుకకు వచ్చిన వారంతా ఆ హీరోయిన్ వైపే చూస్తూ ఉండిపోయారట. ఇంతకు ఆమె ఎవరయ్యా అంటే దిశా పటాని. వీరి వివాహ వేడుకకు హాజరైన ఆమె అద్భుతమైన డ్రెస్సింగ్ స్టైల్ తో అక్కడికి రావడంతో అందరూ ఆమె వైపే చూస్తూ ఉండిపోయారట. అయితే సంగీత్ వేడుకకు దిశా పటాని ఎప్పటిలాగే అద్భుత లుక్ తో కనిపించిందట. దిశా పటాని ధరించిన లేహంగా డిజైనర్ జాకెట్ స్టన్నర్ ఎలివేషన్ తో అందరినీ మెస్మరైజ్ చేసిందట. గోల్డ్ కలర్ వజ్రాల మెరుపులతో ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి క్రిష్టలైన్ స్పెషల్ డ్రెస్ లో దిశా పటాని ఎవరిని కూడా కళ్ళు తిప్పుకోకుండా చేసిందని తెలుస్తోంది.
ఎంతోమంది టాప్ హీరోయిన్స్ వచ్చినా కానీ అక్కడికి వచ్చిన అతిధుల కళ్లన్నీ దిశా మీదే పడ్డట్టు తెలుస్తోంది. ఈ విధంగా దిశ పటాని ఈ వేడుకలో చాలా స్పెషల్ గా ఉందని చెప్పవచ్చు. ఇక ఈవిడే కాకుండా ఈ వేడుకకు ఆలియా భట్, రన్ వీర్ కపూర్, సల్మాన్ ఖాన్, దీపికా పడుకొనే, కియారా అద్వానీ, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, అనన్య వంటి ఎందరో బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వీరందరిలో కెల్లా దిశాపటానియే అందరిని కళ్ళు తిప్పుకోకుండా చేసింది. అయితే ఈమెకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి.