దేవస్థానంలోని స్థానిక అన్నమయ్య భవనంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి గురువారం విలేకరులతో మీడియా సమావేశం నిర్వహించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తిరుమల శ్రీవారి బ్రహ్మాత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ రోజు స్వామివారికి ఆనవాయితీ ప్రకారం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు .దేవస్థానంలోని స్థానిక అన్నమయ్య భవనంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి గురువారం విలేకరులతో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ రోజు నుంచి ఈ నెల 12 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం టీటీడీ 2025 క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరిస్తారు. ఈ నెల 5 నుంచి తిరుపతి అన్ని టీటీడీ కేంద్రాల్లో వాటిని అందుబాటులో ఉంచుతారు. బ్రహ్మాత్సవాల సంధర్భంగా 1.32 లక్షల మందికి రూ.300 దర్శన టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు.అంతేకాదు ఎంత భక్తుల రద్దీ వచ్చినా వేల సంఖ్యలో లాకర్లు ఏర్పాటు చేశారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రజలు ఆకలితో వెళ్లకూడదని అన్నారు. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓపిక గా వెతుక్కొండి.
రోజూ లక్ష మందికి పాలు అందిస్తాము. గరుడసేవ రోజున 24 గంటలూ ఘాట్‌రోడ్లను తెరచి ఉంచుతాం. స్వామి వారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు రావు.ఆర్టీసీ బస్సుల్లో మూడు వేల ట్రిప్పుల ద్వారా మూడు లక్షల మందిని తిరుమలకు తరలిస్తారు. శ్రీవారి చక్రస్నానం రోజున భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లతో పాటు ఎన్ డీ ఆర్ ఎఫ్ , ఎస్ డీఆర్ ఎఫ్ సిబ్బంది బోట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు.