date special: ఈ రోజు డేట్ కి ఉన్న స్పెషలిటీ ఇదే ..అసలు 8 కి ఉన్న ప్రాధాన్యాత ఏంటి ?

అష్టాద‌శ అంటే 18. ఈ 8 అంకెకు, 18 అంకెకూ హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. మన పూజించే మహాలక్ష్ములు ఎనిమిది


Published Aug 08, 2024 05:15:00 PM
postImages/2024-08-08/1723117557_INFINITY.webp

న్యూస్  లైన్, స్పెషల్ డెస్క్: ఈ డేట్ కు ఓ మంచి స్పెషాలిటీ ఉంది. అసలు అష్ట అనే పదం లోనే ఓ స్పెషల్ పవర్ ఉంటుంది. అష్ట అంటే ఎనిమిది... అష్టాద‌శ అంటే 18. ఈ 8 అంకెకు, 18 అంకెకూ హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. మన పూజించే మహాలక్ష్ములు ఎనిమిది. అందుకే అష్టలక్ష్ములు..అష్టాదశ పీఠాలు , అయ్యప్ప గుడి మెట్లు , అష్టమూర్తులు , అష్టఐశ్వర్యాలు ఇలా హిందుపురాణాల్లో అష్ట అనేపదానికి అంటే 8 అనే పదానికి చాలా విలువ ఉంది. వేదాల్లోను ఈ ఎనిమిది ..అష్టాదశ పీఠాలు..ఏంటో చూద్దాం.


* అష్టాదశ పీఠాలు
1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక ), 2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు)
3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్) 4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక)
5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్), 6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్)
7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర), 8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర )
9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ ) ,10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ )
11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా), 12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్)
13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం), 14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్)
15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్), 16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహార్)
17. శ్రీ విశాలాక్షీదేవి ( వారణాశి, ఉత్తరప్రదేశ్), 18. శ్రీ సరస్వతీదేవి ( జమ్మూ కాశ్మీర్)
* మహిళలకు కూడా ఈ ఎనిమిది చాలా ఉపయోగపడేదే..అవేంటంటే..
1. గంధం – 2. తాంబూలం – 3. పుష్పం – 4. భోజనం – 5. వస్త్రం – 6. సతి – 7. స్నానం – 8. సంయోగం. ఈ  ఎనిమిది పూజలు , ఆధ్యాత్మికతలోనే కాదు ఆరోగ్యంలోను చాలా ఉపయోగపడుతుంది. 
వాకింగ్ అంటే దారికి ఎదురుగా నడుస్తూ పోవడం కాదు ... 8 ఆకారంలో నడవటం వల్ల అనేక లాభాలున్నాయి. 8 అనే అంకెను అడ్డుగా చూస్తే ఇన్ఫినిటీ గుర్తులాగా ఉంటుంది. ఇన్ఫినిటీ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.ఇలా నడవడం వల్ల మానసిక లాభాలే కాదు ..సున్నాలు పూర్తిచేస్తూ మీరు అడుగులు వేయాలి. దాని వెంబడే నడుస్తూ ఉండాలి. మెళ్లిగా వేగం పెంచుతూ ఎనిమిది ఆకారంలో నడవాలి. ఇలా నడవడం వల్ల మీ శరీరంలో ఉండే ప్రతి మజిల్ కదులుతుంది.
* అధిక రక్తపోటు సమస్య ఎదుర్కునే వాళ్లు ఎనిమిది ఆకారంలో నడవటం వల్ల లాభాలుంటాయట. గుండె ఆరోగ్యానికి ఈ ఇన్ఫినిటీ వాక్ చాలా మంచిది.
* మెంటల్ పీస్ కావాలంటే ఈ ఇన్ఫినిటీ వాక్ చాలా మంచిది . స్ట్రెస్ బస్టర్ కూడా


అయితే ఈ ఇన్ఫినిటీ వాక్ ఎవరు చెయ్యకూడదంటే..
ఎనిమిది ఆకారంలో నడవటం వల్ల ఎలాంటి ప్రమాదం దాదాపుగా ఉండదు. కానీ కొందరు మాత్రం జాగ్రత్త పడాల్సిందే. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు, కడుపుతో ఉన్న మహిళలు నడవకూడదు. కారణం ఇలా రౌండ్ గా తిరగడం వల్ల కళ్లు తిరుగుతతాయి. తలతిరిగి పడిపోతారు..వికారం లాంటి సమస్యలతో రావచ్చు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu life-style

Related Articles