ప్రస్తుతం దేశీయంగా ధరను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,460 ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం కొనడం గురించి మాట్లాడకపోవడమే మంచిది. బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పతనమైన బంగారం ధరలు మెల్లగా రేట్లు పెరిగి ఈ రోజు భారీ స్థాయిలో రేటు పెరిగింది. తులం బంగారం పై 1300 పెరిగింది. ఇది ఈ వారంలోనే కాదు నెలలోనే రికార్డు స్థాయి పెరుగుదల.నిన్న ఉదయం 6 గంటలకు నమోదైన ధరలతో పోలిస్తే సెప్టెంబర్ 14న దేశీయంగా తులం బంగారంపై 1300 వరకు పెరిగింది. దీంతో మహిళలకు ఉన్నట్టుండి షాకచ్చినట్లయ్యింది. ప్రస్తుతం దేశీయంగా ధరను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,460 ఉంది.
అసలు మెయిన్ సిటీస్ లో బంగారం ధర ఎలా ఉందో చూద్దాం..
* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,460 ఉంది. గ్రాము బంగారం 7400 ఉంది. 22 క్యారట్లు అయితే 6800 గా మార్కెట్ ధర నడుస్తుంది.
* ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,460 ఉంది. దాదాపుగా అన్ని సిటీల్లోను బంగారం ధర ఒకేలా ఉంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,610 ఉంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,460 ఉంది.
* బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,460 ఉంది.
తెలుగు రాష్ట్రాలన్నింటిలోను ఇదే ధర నడుస్తుంది. షో రూమ్ ఛార్జీలు జీఎస్టీలతో కలిపి వేరు వేరు ధరలు నమోదయ్యే అవకాశాలున్నాయి.
వెండి అయితే ఏకంగా రూ.3600 వరకు పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.89,600 ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగానే ఉంది. చెన్నై, హైదరాబాద్, కేరళలలో కిలో వెండి ధర రూ.95,100 వద్ద కొనసాగుతోంది. ఒక్క బెంగుళూరు లో మాత్రం వెండి ధర 87 వేల చిల్లర నడుస్తుంది.