దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.77,050 ఉండగా, శుక్రవారం నాటికి రూ.825 పెరిగి రూ.77,875కు చేరుకుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మరో సారి బంగారం ధర బూస్టింగ్ గా నడిచింది. బంగారం వెండి ధరలు ఎప్పుడు పెరుగుతూ, తగ్గుతూ మార్కెట్ ను టెన్షన్ పెడుతూనే ఉంటాయి. దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.77,050 ఉండగా, శుక్రవారం నాటికి రూ.825 పెరిగి రూ.77,875కు చేరుకుంది. అదే 24 క్యారట్ల బంగారం ధర గ్రాము 7780 చిల్లర నడుస్తుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,240గా నమోదైంది.
దాదాపు రెండు వారాల నుంచి పెరుగుతున్న బంగారం ధర ఈ రోజు మరింత పెరిగింది. వెండి రేటు కూడా పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ తగ్గడం వల్ల అన్ని రాష్ట్రాల్లో బంగారం , వెండి రేట్లు పెరుగుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లో దసరా, దీపావళి పండగలు వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.
ఇక ప్రత్యేంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రాష్ట్రాల్లోను కూడా ఇవే ధరలు . వెండి మాత్రం స్వల్ప తేడాలున్నాయి. గురువారం కిలో వెండి ధర రూ.90,591 ఉండగా, శుక్రవారం నాటికి రూ.2,029 పెరిగి రూ.92,620కు చేరుకుంది. అయితే కలకత్తా తో పాటు ...బెంగుళూరు లో మాత్రం వెండి ధర 86 వేల దగ్గర అమ్ముడవుతుంది.