Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర..వెండి రేటు లక్ష పై మాటే !

24 క్యారట్ల బంగారం 10 గ్రాములు బంగారం ధర రూ.75050 పలుకుతుంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,800 రూపాయిలు పలుకుతుంది. 


Published Sep 16, 2024 10:57:10 PM
postImages/2024-09-17/1726545398_Goldprice20171211205332.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం రేటు రోజు రోజుకి పెరుగుతుంది. బంగారం ధర ఊహించని రేంజ్ లో పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే మళ్లీ బంగారం ధర పెరిగింది. 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు బంగారం ధర రూ.75050 పలుకుతుంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,800 రూపాయిలు పలుకుతుంది. 


బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీని వెనుక ప్రధానంగా అమెరికా డాలర్ పతనం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అమెరికా డాలర్ విలువ ఏకంగా తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది .దీంతో బంగారం రేటు గరిష్ట స్థాయికి పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర , వెండి ధర చుక్కలు చూపిస్తున్నాయి.


గ్రాము మీద రూపాయి పెరిగింది. బంగారం రేటు 22 క్యారట్లు కూడా రూపాయే పెరిగింది. కాని మరింత పెరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ విలువలు సరిగా లేవు. దీంతో బంగారం , వెండి మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వు భేటీ రేపు జరగనుంది ఇందులో పావు శాతం మేర వడ్డీ రేట్లు చేస్తున్నట్లు ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి.


*10 గ్రాముల బంగారం 24 క్యారట్ల బంగారం 75050 రూపాయిలుగా నడుస్తుంది. 22 క్యారట్ల బంగారం రూ.68,800 గా నడుస్తుంది. గ్రాము బంగారం 7500 గా నడుస్తుంది. అంతేకాదు 22 క్యారట్ల బంగారం గ్రాము 6800 గా మార్కెట్లో అమ్మకాలు నడుస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోను ఇదే రేటు నడుస్తుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate stock-market

Related Articles