ఇంత బిజీ కెరియర్ ఉన్నపుడు ఏ యాక్టర్ గుడ్ బై చెప్పడు కాని విక్రాంత్ తను నటనను వదిలేస్తున్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్ లో తెలిపాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: 12th ఫెయిల్ తో విక్రాంత్ క్రేజ్ అన్ని లాంగ్వేజ్ ల్లోను సూపర్ డూపర్ హిట్టయిపోయింది. విక్రాంత్ మాస్సీ నటనకు బడా బడా నేతలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు రీసెంట్ గా మోడీ కూడా విక్రాంత్ నటకు పొగడ్త ల వర్షం కురిపించాడు. అంతేకాదు విశ్రాంత్ కు ఇప్పుడు 37 ఏళ్లు. నిజానికి యాక్టర్ కు మంచి కెరియర్ మొదలయ్యే టైం . ఇప్పుడు విక్రాంత్ కూడా కెరియర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు . ఏడాదికి దాదాపు 7 సినిమాలు చేశాడు. ఇంత బిజీ కెరియర్ ఉన్నపుడు ఏ యాక్టర్ గుడ్ బై చెప్పడు కాని విక్రాంత్ తను నటనను వదిలేస్తున్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్ లో తెలిపాడు.
చాలా మంది నటులు 60, 70 ఏళ్లు దాటినా సినిమాపై ఉన్న ప్రేమతో రిటైర్ కావడానికి ముందుకు రావట్లేదు. ఏప్రిల్ 3, 1987న జన్మించిన విక్రాంత్ మాస్సీ ముంబై, మహారాష్ట్రకు చెందినవాడు. టీవీ ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించాడు. 2007లో 'ధూమ్ మచావో ధూమ్' సీరియల్ యాక్టర్ కాస్త చాలా మంచి హీరో గా ఎదిగాడు.
2013లో 'లూటెరా' సినిమాలో చిన్న పాత్రతో విక్రాంత్ సినీరంగ ప్రవేశం చేశాడు.
దీపికా పదుకొనే నటించిన చపాక్, 12th ఫెయిల్, లవ్ హాస్టల్, ఫోరెన్సిక్ వంటి చిత్రాలలో నటించి తక్కువ సమయంలోనే అభిమానులను సంపాదించుకున్నాడు.
ఇంత క్రేజ్ వచ్చాక ఏ హీరో అయినా డబ్బులు కోసం వెంపర్లాడతారు. కాని విక్రాంత్ తన ఫ్యాన్స్ కు తనకు సపోర్ట్ చేసిన వారికి సింపుల్ గా థ్యాంక్స్ చెప్పేసి యాక్టింగ్ కు గుడ్ బై చెప్తున్నానంటు ట్వీట్ వేశాడు.