రెండు మూడు వారాల్లో దసరా, దీపావళి పండగలు వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.
న్యూస్ , లైన్, స్పెషల్ డెస్క్: పసిడిప్రియులకు నిజంగా శుభవార్త. దాదాపు రెండు వారాల నుంచి పెరుగుతున్న బంగారానికి ఈరోజు కాస్త ఊరటనిచ్చింది. వెండి రేటు కూడా నేడు కిలో పై ధర రూ. 1000 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ తగ్గడం వల్ల అన్ని రాష్ట్రాల్లో బంగారం , వెండి రేట్లు తగ్గాయి. మరో రెండు మూడు వారాల్లో దసరా, దీపావళి పండగలు వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.
22క్యారెట్ల బంగారం ధర పది గ్రాములపై రూ. 50 తగ్గింది. దీంతో తులం ధర రూ. 70వేల 950 వద్ద ట్రేడ్ అవుతోంది. 24క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 50 తగ్గడంత రూ. 77వేల 400 పలుకుతుంది. గ్రాము బంగారం 7095 రూపాయిలుగా నడుస్తుంది. అదే ధర అన్ని మార్కెట్లో నడుస్తుంది.
*ఇక ఢిల్లీ మార్కెట్లో చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 50తగ్గింది. దీంతో రూ. 71,100 వద్దకు దిగివచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 50 తగ్గి రూ. 77, 550 పలుకుతోంది.
దాదాపు అటు నార్త్ ఇటు సౌత్ రెండు వైపులా బంగారం దాదాపు ఇదే ధరతో నడుస్తుంది. తెలుగురాష్ట్రాల్లో , తెలంగాణ , కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లోను ఇదే పరిస్థితి.
ఇప్పటికే వెండి లక్ష రూపాయల మార్క్ ను దాటేసింది. అయితే నేడు వెండి ధర కాస్త తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1000 తగ్గింది. రూ. 1,01,000 వద్దకు దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1000 తగ్గి..రూ. 95వేల వద్దకు దిగివచ్చింది. కలకత్తా, బెంగుళూరు, గుజరాత్ వెండి ధర 93వేల చిల్లర నడుస్తుంది.