సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న స్టోరీలను మరొక హీరోతో చేసిన మూవీస్ అనేకం ఉన్నాయి. అలా చాలామంది దర్శకులు తమ ఊహల్లో ఒక హీరోని అనుకొని స్టోరీ మొత్తం రాసుకుంటారు. కానీ తీరా ఆ సినిమా స్టోరీ హీరోకి చెప్పగా ఆ హీరోకి నచ్చకనో లేక వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండడం వల్లనో దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అనేక కారణాల వల్ల ఒక హీరోతో అనుకున్న సినిమాని మరో హీరోతో చేసిన దర్శకుడు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకి కూడా హీరో కమల్ హాసన్ ని అనుకోలేదట.
న్యూస్ లైన్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న స్టోరీలను మరొక హీరోతో చేసిన మూవీస్ అనేకం ఉన్నాయి. అలా చాలామంది దర్శకులు తమ ఊహల్లో ఒక హీరోని అనుకొని స్టోరీ మొత్తం రాసుకుంటారు. కానీ తీరా ఆ సినిమా స్టోరీ హీరోకి చెప్పగా ఆ హీరోకి నచ్చకనో లేక వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉండడం వల్లనో దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా అనేక కారణాల వల్ల ఒక హీరోతో అనుకున్న సినిమాని మరో హీరోతో చేసిన దర్శకుడు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకి కూడా హీరో కమల్ హాసన్ ని అనుకోలేదట.
మరో హీరోని అనుకొని ఈ సినిమాని రాసుకున్నారట.అంతేకాదు ఈ సినిమాకి కమల్ హాసన్ కంటే ముందే కొంతమంది హీరోలను అనుకొని వారితో కుదరకపోవడంతో చివరికి కమల్ హాసన్ తో తీసారట.మరి ఇంతకీ భారతీయుడు సినిమా కోసం డైరెక్టర్ శంకర్ ఏ హీరోలను ముందుగా తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం.. డైరెక్టర్ శంకర్ భారతీయుడు సినిమా ముందుగా 'పెరియ మనుషన్' అనే టైటిల్ పెట్టి హీరోగా రజినీకాంత్ ని తీసుకోవాలి అని కథ మొత్తం ప్రిపేర్ చేసుకున్నారట.
అయితే ఈ స్టోరీ రజినీకాంత్ కి కూడా చెప్పినప్పటికీ ఆ టైంలో రజినీకాంత్ వేరే సినిమాల్లో బిజీగా ఉండడం కారణంగా ఇదే సినిమాకి మార్పులు చేర్పులు చేసి చివరికి భారతీయుడు మూవీ టైటిల్ ని పెట్టుకొని ఇందులో హీరో రాజశేఖర్ ని మెయిన్ హీరోగా కొడుకు పాత్ర కోసం నాగార్జునని లేదా వెంకటేష్ ని తీసుకుందామని అనుకున్నారట. కానీ వీరి కాంబో కూడా అంతగా సెట్ అవ్వకపోవడంతో కోలీవుడ్ హీరోలైన కార్తీక్, సత్యరాజ్ వంటి హీరోలతో సినిమా తీద్దాం అనుకున్నప్పటికీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు.
దాంతో చివరికి కమలహాసన్ ని సెలెక్ట్ చేసి ఆయనతో భారతీయుడు సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.1996 మే 9న విడుదలైన భారతీయుడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఇక ఈ సినిమా వచ్చాక ఇన్ని సంవత్సరాలకి అంటే దాదాపు 28 సంవత్సరాలకి దీనికి సీక్వెల్ గా భారతీయుడు -2 మూవీని తెరకెక్కించారు దర్శకుడు శంకర్. ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, పాటలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.ఇక ఈ మూవీ జూలై 12న విడుదలవబోతుంది.