Independence day: ఎవర్ గ్రీన్ దేశభక్తి సినిమాలు ఇవ్వే..!

 షార్ట్స్ అంటూ రోజంతా ఫోన్లలోనే గడిపేస్తున్నారు. కానీ, అప్పట్లో వినోదం అంటే సినిమాలే. ఇంకా  స్వాతంత్య్ర దినోత్సవం, లేదా గణతంత్య్ర దినోత్సవం వస్తే టీవీల్లో దేశభక్తి సినిమాలే ఎక్కువాగా వచ్చేవి. ఇక ఈ రోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి.. తప్పక చూడాల్సిన టాప్ 10 దేశభక్తి సినిమాల లిస్ట్‌ను మీ ముందు ఉంచుతన్నాం. 


Published Aug 15, 2024 07:05:54 AM
postImages/2024-08-15/1723722363_top10.jpg

న్యూస్ లైన్, స్పెషల్: చిన్నతనంలో స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి స్కూళ్లలో జరిగే జండావందనం కోసం పరుగులు తీసేవాళ్ళం. ర్యాలీగా వెళ్తూ జండాల ఆవిష్కరణలు జరిగే ప్రాంతాల్లో జాతీయ గీతాన్ని ఆలపించే వాళ్లం. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత టీవీలకు అతుక్కుపోయి.. సినిమాలు చూసేవాళ్లం. ప్రస్తుతం సోషల్ మీడియా రావడంతో ఏం చేసినా రీల్స్, ఫొటోస్ లాగా షేర్ చేసుకుంటున్నారు. షార్ట్స్ అంటూ రోజంతా ఫోన్లలోనే గడిపేస్తున్నారు. కానీ, అప్పట్లో వినోదం అంటే సినిమాలే. ఇంకా  స్వాతంత్య్ర దినోత్సవం, లేదా గణతంత్య్ర దినోత్సవం వస్తే టీవీల్లో దేశభక్తి సినిమాలే ఎక్కువాగా వచ్చేవి. ఇక ఈ రోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి.. తప్పక చూడాల్సిన టాప్ 10 దేశభక్తి సినిమాల లిస్ట్‌ను మీ ముందు ఉంచుతన్నాం. 


ఖడ్గం: 
దేశభక్తి సినిమా అనగానే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ మొట్టమొదట గుర్తొచ్చే చిత్రం ఖడ్గం. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో శ్రీకాంత్,  రవితేజా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఖడ్గం అటు కామెడీగా ఉంటూనే ఇటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఈ సినిమాలోని 'మేమే ఇండియన్స్..' అనే పాటకు ఇప్పటికీ చాలా క్రేజ్ ఉంది. ఇది ఒక్కటే కాదు. ఈ చిత్రంలోని ప్రతి ఒక్క పాట చాలా బాగుంటుంది. ఒకరకంగా ఈ సినిమాను మ్యూజికల్ హిట్ అని కూడా చెప్పొచ్చు. 


ఘాజీ:
ఇక వాస్తవసంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఘాజీ సినిమాలో కూడా దేశభక్తి ఉట్టిపడుతుందనే చెప్పొచ్చు. 1971లో మునిగిపోయిన పాకిస్థాన్ సబ్ మైరైన్ కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. బంగ్లాదేశ్‌తో యుద్ధం చేస్తున్న తమ సైనికులకు సహాయం చేయడానికి పాకిస్తాన్ సైన్యం ఘాజీ జలాంతర్గామి పంపుంతుంది. ఇక ఘాజీ తన సైనికుల వద్దకు ఎలా చేరుకుంటాడు. ఈ  క్రమంలో ఎలాంటి సమస్యలు వస్తాయి.  

భారతీయుడు: 
1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాను చూడని వారిని వేళ్లపై లెక్కపెట్టుకోవచ్చు. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి..! ఈ సినిమాలో కమల్ హాసన్, మనీషా కోయిరాలా హీరోహీరోయిన్లుగా నటించగా.. ఊర్మిళ, సుకన్య కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు ఏఆర్.రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించారు. ఒక స్వాంతంత్ర సమరయోధుడు దేశంలో పెరిగిపోయిన లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఏం చేసాడు అనేది అంశంపై ఈ సినిమాలో కథ సాగుతుంది. 


మేజర్ చంద్రకాంత్:
ఈ సినిమాను చుసిన వారిలో 90's కి చెందినవారే ఎక్కువ మంది ఉంటారు. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే ఓ దేశభక్తుడి కథ ఈ సినిమా. అయితే, ఈ సినిమా తెలిసిన వారు తక్కువే కానీ, ఇందులోని 'పుణ్యభూమి నాదేశం..' అనే పాట తెలియని వారు ఉండరు. దేశభక్తి అనగానే గుర్తుకువచ్చే పాటల్లో ఇది కూడా ఒకటి. 


అల్లూరి సీతారామ రాజు: 
'ఫ్రీడమ్ ఫైటర్' ఈ మాట వినగానే గుర్తికు వచ్చే గొప్ప పోరాట యోధుల్లో అల్లూరి సీతారామ రాజు కూడా ఒకరు. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి ఆయన. అల్లూరి సీతారామ రాజు జీవితచరిత్ర ఆధారంగానే ఆయన పేరున ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామ రాజుగా కనిపించారు. ఈ సినిమాలోని 'తెలుగువీర లేవరా..' అనే పాట చాలా ప్రభావితమైనది.


రోజా: 
రోజా సినిమా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఇందులో అరవింద్ స్వామి, మధుబాల ప్రధానపాత్రల్లో కనిపించారు. జమ్మూ కాశ్మీర్‌లో రహస్య మిషన్‌లో భాగంగా కిడ్నాప్ అయిన తన భర్తను విడిపించుకోవడానికి హీరోయిన్ చేసే ప్రయత్నాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా 18వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా నామినేట్ అయింది.


సైరా నరసింహారెడ్డి: 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తీశారు. బ్రిటీష్ వారు అతని కుటుంబాన్ని కడపలో బంధించినప్పటికీ లొంగిపోని గొప్ప వ్యక్తి ఆయన . 1847 ఫిబ్రవరిలో సుమారు 2000 మంది చూస్తుండగానే బ్రిటీష్ వాళ్లు ఆయనను చంపేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఉయ్యాలవాడ గురించి తెలియని వారి ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలి. 


ఆజాద్:
హీరో నాగార్జున, దివంగత నటి సౌందర్య జంటగా నటించిన చిత్రం ఆజాద్. ఈ సినిమాలో శిల్ప శేట్టి, రఘువరణ్, బ్రహ్మానందం, ఎల్.బి.శ్రీరామ్ కీలక పాత్రల్లో కనిపించారు. పాకిస్థాన్ కు చెందిన ఓ టెర్రరిస్ట్  ఇండియన్ ముజాహిదీన్ భారతదేశాన్ని నాశనం చేసే పనిలో ఉన్నాడని ఆజాద్ తెలుసుకుంటాడు. అయితే, దేశాన్ని ఉగ్రవాది నుండి ఎలా రక్షిస్తాడు అనే దానిపై ఈ కథ సాగుతుంది. 


బొంబాయి: 
అరవింద్‌ స్వామి, మనీషా కోయిరాలా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బొంబాయి మతకలహాలు నేపథ్యంలో వచ్చింది. ముస్లిం మతానికి చెందిన అమ్మాయిని ప్రేమించిన హీరో.. తన ప్రేమను ఎలా దక్కించుకుంటాడు అనే అంశంపై కథ సాగుతుంది. అయితే, ఎంతో కష్టపడి తనను పెళ్లి చేసుకుంటాడు. పెద్దలు కూడా తమ కోపం తగ్గించుకొని హీరో తల్లిదండ్రులు బొంబాయి వెళ్తారు. కానీ, ఆ సమయంలోనే అక్కడ మాత కలహాలు మొదలవుతాయి. ఏ కలహాల నుండి వాళ్లు ఎలా తపించుకుంటారు అనేది అసలు కథ. 


జై జవాన్: 
అక్కినేని నాగేశ్వరరావు, భారతి ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా జై జవాన్. ఈ సినిమా 1970, ఫిబ్రవరి 26న విడుదలయింది. దేశభక్తుడు, స్వాతంత్య్రా సమరయోధుడి కథగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో చాలా మంచి ఆదరణను తెచ్చుకుంది. ఈ సినిమాలోని 'స్వతంత్ర భారతయోధుల్లారా సవాలేదుర్కొని కదలండి..' అనే పాట అప్పుడప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం సమయంలో వినిపిస్తూ ఉంటుంది. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu cinema-news indipendence-day 78independenceday independencedaytop10

Related Articles