BOAT ACCIDENT: తూర్పు కాంగోలో పడవ ప్రమాదం ..50 మంది జలసమాధి!

సుమారు 100 మంది ప్రయాణికులతో  వెళ్తున్నపుడు ఈ పడవ బోల్తా పడింది, దీని ఫలితంగా కనీసం 50 మంది మరణించారు


Published Oct 04, 2024 08:48:54 AM
postImages/2024-10-04/1728030362_108838398dc3f8965ae96412f98f5b78d987df6c7.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :తూర్పు కాంగోలోని కివు సరస్సులో నిన్న ఘోర ప్రమాదం జరిగింది. పరిమితికి మించి జనాలు బోట్లో ప్రయాణించడంతో పడవ అదుపుతప్పి నీటి మునిగిపోయింది.సుమారు 100 మంది ప్రయాణికులతో  వెళ్తున్నపుడు ఈ పడవ బోల్తా పడింది, దీని ఫలితంగా కనీసం 50 మంది మరణించారు

సౌత్ కివు ప్రావిన్స్‌లోని మినోవా నుండి నార్త్ కివు ప్రావిన్స్‌లోని గోమాకు ప్రయాణిస్తున్న ఓవర్‌లోడ్ పడవ, కిటుకు ఓడరేవు సమీపంలో డాక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా మునిగిపోయింది. పరిమితి మించి జనాలు ఎక్కడంతో పడవ మునిగిపోయింది. చాలా వరకు జనాలు ఈత రాకపోవడం వల్లే నీటిమునిగిపోయారు. పైగా లైఫ్ జాకెట్స్ లాంటి సదుపాయాలు కల్పించకపోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది.పది మంది ప్రాణాలు కైషెరో ఆసుపత్రికి తరలించారు.


దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ జీన్-జాక్వెస్ పురుసి స్థానిక రేడియో స్టేషన్‌కి ఇలా తెలియజేసారు, "ఈ పడవలో దాదాపు ముప్పై మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉన్న సమయంలో దాదాపు వంద మందితో ప్రయాణిస్తున్నారు." అందుకే ఈ ప్రమాదం జరిగింది. దీనికి కారణమైన వారిని బోటు యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu boat-accident kuvi-boat-accident

Related Articles