ఈ నేపథ్యంలోనే ఏపీ అధికారులు సైతం అప్రమత్తుమయ్యారు. దీంతో తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. తాత్కాలిక గేట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కర్ణాటక హోస్పేటలో తుంగభద్ర డ్యాం తెగిపోయింది. డ్యాం వద్ద 19వ గేట్ చైన్ లింక్ తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 11 గంటల నుండే హోస్పెట్ డ్యాం 19వ గేట్ కనిపించకుండా పోయినట్లు సమాచారం. చైన్ లింక్ తెగిపోవడంతో గేట్ కనిపించడం లేదని అధికారులు గుర్తించారు. ఇప్పటికే తుంగభద్ర డ్యాం నుంచి 75 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. తుంగభద్ర డ్యాంకు ఇన్ ప్లో తగ్గడంతో.. గేట్లు మూసేందుకు అధికారాలు ప్రయత్నించారు. 19వ గేట్ మూసే సమయంలో చైన్ లింక్ తెగిపోయిందని అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఏపీ అధికారులు సైతం అప్రమత్తుమయ్యారు. దీంతో తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. తాత్కాలిక గేట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా నది పరీవాహనక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు. నీరు వృధాకాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.