ప్రస్తుత కాలంలో చాలామంది కార్లు కొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ అన్ని రకాల ఫీచర్స్ కలిగినటువంటి కార్ల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. సాధారణ మొదటి ప్రజలు అంత ధర పెట్టి కార్లు కొనడం కష్టమే. అలాంటి
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది కార్లు కొనాలని ఆశపడుతూ ఉంటారు. కానీ అన్ని రకాల ఫీచర్స్ కలిగినటువంటి కార్ల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి. సాధారణ మొదటి ప్రజలు అంత ధర పెట్టి కార్లు కొనడం కష్టమే. అలాంటి వారి కోసం కేవలం 10 లక్షల లోపే అన్ని హంగులు, ఫీచర్స్ కలిగినటువంటి కారు మోడల్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెట్రోల్ ఎల్పిజి, డీజిల్, ఎలక్ట్రికల్ తో నడిచే కార్లు. మీకు ఏ టైపు కారు కావాలనుకున్న లేటెస్ట్ ఫీచర్లతో 10 లక్షల లోపు లభించే కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఫ్రాంక్స్:
ఈ కంపెనీకి చెందిన కార్లు అద్భుతమైనటువంటి ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మారుతి సుజుకి ఫ్రాంక్స్. దీని ధర 7.51 లక్షలతో మొదలై 10 లక్షల వరకు పొందవచ్చు. ఇందులో అద్భుతమైనటువంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం టచ్ స్క్రీన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది పంచ్ XUV, ఎక్స్ టర్ కంటే ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్ :
ప్రస్తుతము ఉన్నటువంటి కార్ల కంపెనీలో నిస్సాన్ కూడా అద్భుతమైనటువంటి ఆదరణ పొందింది. ఈ కంపెనీ నుంచి నిస్సాన్ ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. దీని ద్వారా ఆరు లక్షల నుంచి 11.11లక్షల మధ్య ఉంది. ఇందులో డిజిటల్ డివైజ్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటోమేటిక్ అట్మాస్పియర్ కంట్రోల్ ఉన్నాయి.
రెనాల్ట్ కీగర్ :
ప్రస్తుతం మార్కెట్ లో దూసుకుపోతున్న కంపెనీ రెనాల్ట్. రెనాల్ట్ కిగర్ ఆరు లక్షల నుంచి 11.23 లక్షల వరకు ఎక్స్ షోరూం ధర ఉంది. ఇది నిస్సాన్ మాగ్నెట్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఇందులో కూడా అలాగే ఉంటాయట.