Chiranjeevi: చిరంజీవి బర్త్డేకి ఊహించని గిఫ్ట్.. మెగా ఫ్యాన్స్ కి పండగే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈయన బర్త్ డే ఆగస్టు 22న రాబోతోంది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీల బర్త్డే ల సందర్భంగా వారి కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లతో పాటు వారు నటించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు  అలా ఇప్పటికే రీ రిలీజ్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.అయితే తాజాగా మెగాస్టార్ బర్త్డే సందర్భంగా వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు మెగాస్టార్ కి ఒక మంచి బహుమతి ఇవ్వబోతున్నారు  అదేంటంటే వారి బ్యానర్ లో వచ్చిన చిరంజీవి సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారట..


Published Jul 24, 2024 04:01:00 PM
postImages/2024-07-24/1721816256_chiru.jpg

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈయన బర్త్ డే ఆగస్టు 22న రాబోతోంది. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీల బర్త్డే ల సందర్భంగా వారి కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లతో పాటు వారు నటించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు  అలా ఇప్పటికే రీ రిలీజ్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.అయితే తాజాగా మెగాస్టార్ బర్త్డే సందర్భంగా వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు మెగాస్టార్ కి ఒక మంచి బహుమతి ఇవ్వబోతున్నారు .

అదేంటంటే వారి బ్యానర్ లో వచ్చిన చిరంజీవి సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారట.. ఇక విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవికి వైజయంతి మూవీస్ బ్యానర్ తో విడదీయలేని అనుబంధం ఉంది. వీరి బ్యానర్లో చిరంజీవి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.ఇక అలాంటి సినిమాల్లో ఇంద్ర మూవీ ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఎన్నో రికార్డులు తిరగ రాసిన ఇంద్ర మూవీని చిరంజీవి బర్త్డే కానుకగా రీ రిలీజ్ చేయబోతున్నట్టు వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

అంటే చిరంజీవి బర్త్డే ఆగస్టు 22న ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారట. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మించిన ఇంద్ర మూవీకి బి.గోపాల్ దర్శకత్వం వహించారు  ఈ మూవీకి చిన్ని కృష్ణ కథ అందించగా చిరంజీవి నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.అలాగే ఈ మూవీలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రేలు హీరోయిన్స్ గా చేశారు. ఇంద్ర మూవీ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. అయితే అలాంటి ఈ మూవీ జూలై 24, 2002 లో విడుదలై అప్పుడున్న రికార్డులన్నీ తిరగ రాసింది.

అంతేకాదు చిరంజీవి సినీ కెరియర్ లో ఇంద్ర మూవీ ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.అయితే అలాంటి ఈ ఇంద్ర మూవీ నేటితో 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో ఈ సినిమాపై గురించి ఓ గుడ్ న్యూస్ చెప్పారు వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు.. చిరంజీవి బర్త్డే రోజు ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

https://x.com/VyjayanthiFilms/status/1816021669045231655

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu indra-movie-re-release vyjayanti-movies-banner aswini-datt

Related Articles