Varalakshmi: పెళ్లిలో వరలక్ష్మికి డైమండ్ చీర.. ధర ఎంతంటే.?

కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్యనే ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ అయినటువంటి నికోలయ్ సచ్ దేవ్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వరలక్ష్మి తన పెళ్లిలో డైమండ్ చీర కట్టుకుంది అంటూ నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి నిజంగానే వరలక్ష్మి శరత్ కుమార్ డైమండ్ చీర కట్టుకుందా..దాని ఖరీదు ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం..ఇదంతా పక్కన పెడితే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిలో నికోలయ్  బంగారు చెప్పులు, డైమండ్ చీరను భార్య కి గిఫ్ట్ గా ఇచ్చినట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే నికోలయ్ సచ్ దేవ్ కి ఆస్తులు బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకి ముంబైలో సొంతంగా ఆర్ట్ గ్యాలరీ కూడా ఉందట.అలాగే ఈయన ఆస్తులు 900 కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తన భార్యకి పెళ్లిలో అలాంటి బహుమతులు ఇచ్చారనే రూమర్స్ చక్కర్లు కొట్టడంతో దీనిపై క్లారిటీ ఇచ్చారు శరత్ కుమార్.బంగారు చెప్పులు, డైమండ్ చీర అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని కొట్టి పారేసారు


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-08/1720415840_varalakshmi.jpg

న్యూస్ లైన్ డెస్క్: కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్యనే ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ అయినటువంటి నికోలయ్ సచ్ దేవ్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరి పెళ్లి జూలై 2న థాయిలాండ్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ పెళ్లికి కొద్దిమంది సన్నిహితులే వెళ్ళినప్పటికీ చెన్నైలోని తాజ్ హోటల్ లో జరిగిన రిసెప్షన్ పార్టీకి మాత్రం ఎంతోమంది సెలబ్రిటీలు హాజరయ్యారు.అలా పెళ్లి,రిసెప్షన్ కూడా చేసుకున్నాక ప్రస్తుతం ఈ కొత్తజంట హనీమూన్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఇప్పటికే ఎన్నో పెళ్లి వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇందులో భాగంగా వరలక్ష్మి తన పెళ్లిలో డైమండ్ చీర కట్టుకుంది అంటూ నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి నిజంగానే వరలక్ష్మి శరత్ కుమార్ డైమండ్ చీర కట్టుకుందా..దాని ఖరీదు ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం.. శరత్ కుమార్,ఛాయా లకి పుట్టిన కూతురే వరలక్ష్మీ శరత్ కుమార్.అయితే శరత్ కుమార్ తన భార్యకి విడాకులు ఇచ్చి రాధిక అనే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం శరత్ కుమార్ రాధికతోనే ఉంటున్నారు. ఇక ఛాయా కి విడాకులు ఇచ్చినప్పటికీ వరలక్ష్మికి శరత్ కుమార్ ఏమాత్రం తక్కువ చేయలేదు. ఇక రాధిక కూడా వరలక్ష్మీని సొంత కూతురు లాగే చూసుకుంటుంది.

అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ మొదట కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.కానీ ఈమె పర్సనాలిటీకి హీరోయిన్ కటౌట్ అంతగా సెట్ అవ్వకపోవడంతో  లేడి విలన్ గా అలాగే కీలక పాత్రలు చేస్తూ వస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో ఈమెకు తెలుగులో కూడా బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల నుండి వరలక్ష్మి పెళ్లి చేసుకోదనే వార్తలు వినిపించినప్పటికీ ఎట్టకేలకు నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్ళాడి అందరి నోర్లు మూయించేసింది.

వరలక్ష్మికి ఇది మొదటి పెళ్లి అయినప్పటికీ నికోలయ్ కి మాత్రం మొదటి పెళ్ళై 15 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఇదంతా పక్కన పెడితే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిలో నికోలయ్  బంగారు చెప్పులు, డైమండ్ చీరను భార్య కి గిఫ్ట్ గా ఇచ్చినట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే నికోలయ్ సచ్ దేవ్ కి ఆస్తులు బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకి ముంబైలో సొంతంగా ఆర్ట్ గ్యాలరీ కూడా ఉందట.అలాగే ఈయన ఆస్తులు 900 కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తన భార్యకి పెళ్లిలో అలాంటి బహుమతులు ఇచ్చారనే రూమర్స్ చక్కర్లు కొట్టడంతో దీనిపై క్లారిటీ ఇచ్చారు శరత్ కుమార్.బంగారు చెప్పులు, డైమండ్ చీర అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని కొట్టి పారేసారు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nicholai-sachdev sarath-kumar radhika varalakshmi-sarath-kumar

Related Articles