శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం. మహిళలు తన భర్త సిరి , సంపదలు , ఆరోగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు.
తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. సంపదలంటేనే మహాలక్ష్మి కాదు .. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలెన్నో ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది. ఇలా అష్టలక్ష్ముల ప్రాధాన్యత ఉన్న వ్రతమే వరమహాలక్ష్మి వ్రతం. ఈ పూజకు ఏం కావాలో చూద్దాం.
పూజా సామాగ్రి..పసుపు, కుంకుమ,
గంధం, విడిపూలు, పూల మాలలు,
తమలపాకులు, 30
వక్కలు, ఖర్జూరాలు,
అగరవత్తులు,
కర్పూరం,
చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు
మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు,
అమ్మవారి ఫోటో,
కలశం,
కొబ్బరి కాయలు,
తెల్ల దారం లేదా నోము దారం, లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,
బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.
అసలు ఈ వ్రతం ఎలా మొదలయ్యింది..
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. ముఖ్యంగా ముత్తైదువులు చేసుకోవల్సిన పూజ.
వ్రతం చేయు విధానం..
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం వేసి అమ్మవారి కలశ స్థాపన చేసి ..పూజలు చేసుకోవాలి. పూజకు తెల్లని పూలు..ఎరుపు పూలు..ఉండేలా చూసుకొండి. అమ్మవారి అనుగ్రహం కలిగి తీరుతుంది. అయితే పూజకు తోరం కూడా చాలా అవసరం. ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఈ తోరం పూజలో ఉంచి ..భార్యా భర్తలు ఇద్దరు లేదా భార్య కట్టుకొని ఆ రోజంతా ఉపవాసం తో అమ్మను కొలిస్తే మంచి జరుగుతుంది. మహా గణపతిని మంత్రాలతో పూజించాలి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
గణపతి పూజ అయిపోగానే..అమ్మవారకి అష్టోత్తరాలు చదివి..అప్పుడు సుగంధ, పుష్పాలతో పూజించి అప్పుడు కథ చదివి ...హారతి ఇవ్వండి. ఎర్రటి పూలు పూజలో ఉండేలా చూసుకొండి. తెల్ల వారే పూజ అయ్యేలా చూసుకొండి. దీని వల్ల బ్రహ్మమూహూర్త బలం కూడా మీ ఇంటికి మంచి చేస్తుంది.