కాశీ అందాలు చూడడానికి దేశ విదేశాల నుంచి తరలివస్తారు. అయితే స్వామి వారి పూజలకోసం దగ్గర్లో ఉండే హోటల్స్ , సత్రాలు చాలా బిజీ గా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; దీపావళి వేడుకలకు పుణ్యక్షేత్రం కాశీ చాలా అందంగా ముస్తాబయ్యింది. నవంబర్ 15న కాశీ ఘూట్లను 12 లక్షల దీపాలతో అలకరిస్తారు. ఈ దీపపు కాంతులను లేజర్ షో , గ్రీన్ బాణాసంచా తో మరింత అందంగా అధ్భుతంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాశీ అందాలు చూడడానికి దేశ విదేశాల నుంచి తరలివస్తారు. అయితే స్వామి వారి పూజలకోసం దగ్గర్లో ఉండే హోటల్స్ , సత్రాలు చాలా బిజీ గా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
వీటిలో లక్షలాది దీపాలను గోమయంతో తయారు చేయనున్నారు. దీపావళి వేడుకలను ప్రభుత్వం ఇప్పటికే ప్రాంతీయ వేడుకగా ప్రకటించింది. ఈ వేడుకల్లో భాగంగా లేజర్ షో, గ్రీన్ బాణసంచా కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాశీలోని 84 ఘూట్లు , కుండాలు , చెరువులను ఈ ఏడాది 12 లక్షలకు పైగా దీపాలతో అలకరించనున్నారు. 12 లక్షల దీపాల్లో 2.5 లక్షల నుంచి 3లక్షల దీపాలను గోమయంతో తయారుచేయనున్నారు. గంగా నదిలో కూడా దీపాలను వెలిగించనున్నారు. దీంతో గంగా నది మొత్తం దీపాల కాంతులతో దగదగలాడుతుంది. ఘాట్లను శుభ్రం చేసి, విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.
ప్రత్యేకంగా కాశీ అందాలు చూడడానికి దేశ , విదేశాల నుంచి ..అన్ని రాష్ట్రాల నుంచి దీపావళికి కాశీ నగరం చేరుకుంటారు. అన్నపూర్ణేశ్వరి నిలువెత్తు బంగారం తో దర్శనం ఇస్తుంది. కాశీ పట్టణం అడుగడుగునా కాంతిమయం అవుతుంది.