మన భారత దేశంలో ఎక్కువగా గోవులను దేవుళ్ళుగా పరిగణిస్తారు. గో సేవ చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. ఇప్పటికీ పల్లెటూర్లలో పశువులను దేవుళ్ళుగా మొక్కి పూజలు చేస్తూ ఉంటారు. కామధేనువు అనేది చాలా పవిత్రమైనది.
న్యూస్ లైన్ డెస్క్: మన భారత దేశంలో ఎక్కువగా గోవులను దేవుళ్ళుగా పరిగణిస్తారు. గో సేవ చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. ఇప్పటికీ పల్లెటూర్లలో పశువులను దేవుళ్ళుగా మొక్కి పూజలు చేస్తూ ఉంటారు. కామధేనువు అనేది చాలా పవిత్రమైనది. దేవతలు, రాక్షసులు, శిరసాగరాన్ని మదిస్తున్న సమయంలో అందులో నుంచి కామధేనువు ఉద్భవిస్తుందట. అందుకే ఆవుని సురభి అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో దేవతలు ఏ కోరిక కోరుకున్న తీరుతుందని అంటారు. అప్పటినుంచి ఆవులను పూజించడం మొదలు పెడుతూ వచ్చారు.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కామధేనువు విగ్రహాన్ని ఉంచితే సిరిసంపదలు తులతుగుతాయట. డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. కామదేనువు విగ్రహాన్ని ఇంట్లో ఏ ప్రదేశంలో పెట్టాలో ఇప్పుడు చూద్దాం..
మనశ్శాంతి:
కామదేనువు అనేది మనశ్శాంతిని పెంచుతుందని నమ్ముతారు. దీన్ని తూర్పు దిశలో ఉంచితే ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఒత్తిడి తగ్గుతుందట.
సంపద:
కామదేనువు విగ్రహం అనేది ధనాభివృద్ధికి సంపదకు ప్రతీక. మన ఇంటి ఆగ్నేయ మూలలో ఈ ఆవు విగ్రహాన్ని ఉంచితే అప్పులు తగ్గిపోయి వ్యాపార పెట్టుబడులు పెరిగిపోయి విజయం సాధిస్తావట.
సామరస్య వాతావరణం:
ఆవు విగ్రహం అనేది హార్మోన్ బ్యాలెన్స్ కు ప్రతీక. గదిలో ప్రవేశద్వారం వద్ద ఉంచితే ప్రతికూల శక్తులు తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటున్నారు.
ఆధ్యాత్మిక వృద్ధి:
కామధేనువు అనేది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. దీన్ని ప్రార్థన లేదా ధ్యానం చేసే ప్రదేశం దగ్గర ఉంచితే ఆధ్యాత్మికంగా వృద్ధి చెందవచ్చు.