భూమికి ఎవ్వరూ ముగ్గు పోయలేదు.. ఒకరు చేసిన పని మరొకరు చేసుకుంటూ వస్తున్నారని తెలిపారు. తాను రాజకీయాలకు కొత్త కాదని, సభకు మాత్రమే కొత్త అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో సమావేశం వాడి వేడిగా సాగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలకు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే గంటకండ్ల జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీలో దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి.. సభ తీరు చూస్తుంటే విమర్శలు, ప్రతి విమర్శలకే సరిపోతుందని అన్నారు. పాత ఎమ్మెల్యేలను చూసి కొత్త ఎమ్మెల్యేలు నేర్చుకునే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరగాలని ఆయన అన్నారు. భూమికి ఎవ్వరూ ముగ్గు పోయలేదు.. ఒకరు చేసిన పని మరొకరు చేసుకుంటూ వస్తున్నారని తెలిపారు. తాను రాజకీయాలకు కొత్త కాదని, సభకు మాత్రమే కొత్త అని వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. సమస్యలను అన్నిటినీ పక్కన పెట్టి విమర్శలు చేసుకునేందుకే సభ సమయం మొత్తం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు కావాల్సిన కరెంట్ అందడం లేదు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కానీ, వాటి కోసం ఎలక్ట్రిక్ డిపోలు ఇంకా ఏర్పాటు కాలేదని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి.. ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల వచ్చేదేమీ లేదని వెంకటరమణారెడ్డి అన్నారు.