విడాకులు అనే పదం వచ్చింది అసలు సినిమా ఇండస్ట్రీ నుంచే కావచ్చు. సాధారణంగా ఇండస్ట్రీ నుంచి మంచి నేర్చుకోవాలి కానీ, ఈ మధ్యకాలంలో విడాకులు అనే పదాన్ని బయట జనాలు నేర్చుకుంటున్నారు.. సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఈజీగా విడిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు.. అదే ప్రాసెస్ ను బయట ఉన్నటువంటి కొంతమంది పాటిస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక ఈ కాలంలో సినీ ఇండస్ట్రీ వాళ్ళు అయితే, ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పడం కష్టంగా మారింది. మనకు తెలిసిన జంటల్లో ధనుష్ ఐశ్వర్య, నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయారు.
న్యూస్ లైన్ డెస్క్: విడాకులు అనే పదం వచ్చింది అసలు సినిమా ఇండస్ట్రీ నుంచే కావచ్చు. సాధారణంగా ఇండస్ట్రీ నుంచి మంచి నేర్చుకోవాలి కానీ, ఈ మధ్యకాలంలో విడాకులు అనే పదాన్ని బయట జనాలు నేర్చుకుంటున్నారు.. సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఈజీగా విడిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు.. అదే ప్రాసెస్ ను బయట ఉన్నటువంటి కొంతమంది పాటిస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక ఈ కాలంలో సినీ ఇండస్ట్రీ వాళ్ళు అయితే, ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పడం కష్టంగా మారింది. మనకు తెలిసిన జంటల్లో ధనుష్ ఐశ్వర్య, నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయారు.
వీరి విడాకులకు అసలు కారణాలు ఏంటో కూడా బయట జనాలకు తెలియదు. ఇదే తరుణంలో తమిళ తెలుగు స్టార్ హీరో దళపతి విజయ్ కూడా భార్యతో విడాకులు తీసుకొని, త్రిషను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతో, అబద్ధం ఏమిటో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా నటుడు విజయ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ టైం లోనే నటి త్రిష ప్రచురించినటువంటి ఒక ఫోటో వివాదానికి దారితీసింది. దళపతి విజయ్ 50వ పుట్టినరోజు త్రిషతో కలిసి చేసుకున్నారు. ఆ సమయంలోనే వీరిద్దరూ లిఫ్ట్ లో దిగిన ఫోటో బయటకు వచ్చింది.
ఈ ఫోటోని చూసే చాలామంది అనుమాన పడుతున్నారు. ఈ క్రమంలోనే దళపతి విజయ్ మరియు ఆయన భార్య సంగీత వేరువేరుగా నివసిస్తున్నారని వార్తలు జోరు అందుకున్నాయి. నిజానికి సంగీత విజయ్ వివాహమై 23 సంవత్సరాలు దాటింది. వీరికి ఇద్దరు పిల్లలు . అయితే ఎలాంటి ఫంక్షన్లు అయినా ఏ ఈవెంట్స్ జరిగిన విజయ్ తన భార్య సంగీతాని వెంట వేసుకొని వెళ్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు. దీంతో విజయ్ తన భార్యతో కలిసి ఉండడం లేదని ఒక వార్త ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సంగీత లండన్ లో ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే స్పందించినటువంటి సుచిత్ర మీడియాతో మాట్లాడుతూ విజయ్ దళపతి భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని చెప్పింది. అంతేకాదు ఆయన త్రిషను రెండో వివాహం చేసుకోబోతున్నారని అన్నది. ఆమె అలా అనడంతో అంతా షాక్ అయిపోయారు.
అయితే తాను రాజకీయాల్లోకి వస్తే తప్పక శిరీష తన వెంట ఉంటుందని సుచిత్ర తెలియజేసింది. ఒకనాడు తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్ వెంటా జయలలిత ఏ విధంగా ఉందో, ఇప్పుడు విజయ్ వెంట త్రిష ఉంటే రాజకీయాల్లో బాగా రాణిస్తారని అందుకే ఆయన భార్య సంగీతాకి విడాకులు ఇచ్చి త్రిషాను పెళ్లి చేసుకోబోతున్నారని సుచిత్ర షాకింగ్ కామెంట్స్ చేయడంతో అవి సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి ఈ వార్తలకు నిజమైన రూపం దాలుస్తుందా లేదంటే రూమర్లుగానే మిగిలిపోతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.