Vijay Devatakonda : గుర్తుపట్టలేని లుక్ లో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కొత్త సినిమా లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బైక్ మీద వెనకాల కూర్చొని వెళ్తున్న ఆ ఫొటో విజయ్ రాబోయే సినిమాలో స్టిల్ లా ఉంది. 


Published Jul 24, 2024 07:55:00 PM
postImages/2024-07-24/1721831100_vijay.jpg

న్యూస్ లైన్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా వీడీ 12’. ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా పూర్తవుతోంది. గత నెలలో విజయ్ గన్ తో ఉన్న పోస్టర్‌ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసుకున్నాడు.

కాగా.. తాజాగా విజయ్ మరో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎర్ర షర్ట్ వేసుకొని.. బైక్‌ మీద వెనకాల కూర్చొని ఎవరినో వెతుకుతున్నట్టుగా ఉందీ ఫొటో.  షార్ట్ హెయిర్ స్టైల్, గడ్డంతో గుర్తు పట్టలేని లుక్ లో దర్శనమిచ్చాడు.

కాగా.. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా వీడీ 12 తెరకెక్కుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా విజయ్‌కు జోడీగా నటిస్తోంది. సత్యదేవ్‌ ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడట. వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటోంది.

 

 

newsline-whatsapp-channel
Tags : kalki-movie vijaydevarakonda movies movie-news vijay-deverakonda new-movie jersy-movie

Related Articles