మంగళగిరిలో రెండు కోట్ల 30 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో వినాయకుని మండపం అలంకరించారు. రంగురంగుల డబ్బు కాగితాలతో పూలు , లతలు తీగలు అమర్చి చాలా అందంగా తయారుచేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వానలు , వరదలు ఎన్ని ఉన్నా ..ఆది దేవుడు గణపతి పూజలు అత్యధ్భుతంగా జరుగుతున్నాయి. యధా శక్తి పూజలు , ప్రసాదాలతో గణనాధునికి అంగ రంగ వైభవంగా నవ రాత్రులు చేస్తున్నారు. చిత్ర విచిత్రమైన రూపాల్లో అందంగా తయారుచేయడమే కాదు నవరాత్రులు కూడా దానాలు , ధర్మాలు అన్నదానాలాంటి కార్యక్రమాలతో సందడి సందడిగా చేస్తున్నారు.
అయితే మంగళగిరిలో రెండు కోట్ల 30 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో వినాయకుని మండపం అలంకరించారు. రంగురంగుల డబ్బు కాగితాలతో పూలు , లతలు తీగలు అమర్చి చాలా అందంగా తయారుచేశారు. దీనిని చూడడానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు .
ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లో నిలబడి మరీ దర్మనాలు చేసుకుంటున్నారు. గణనాథుడు ఈ అలంకరణలో అందంగా ఉన్నాడు.