Vishwambhara: "విశ్వంభర" టీజర్.. డైరెక్టర్ ఏమన్నారంటే.?

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర  సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని చాలామంది ఎదురు చూశారు. ఇదే తరుణంలో టీజర్ రిలీజ్ అవుతుందని ప్రచారం కూడా సాగింది.


Published Aug 22, 2024 12:04:00 PM
postImages/2024-08-22/1724306795_vishwabhara.jpg

న్యూస్ లైన్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర  సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని చాలామంది ఎదురు చూశారు. ఇదే తరుణంలో టీజర్ రిలీజ్ అవుతుందని ప్రచారం కూడా సాగింది. టీజర్ రిలీజ్ అయ్యే టైం చెబుతూ  ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. 10 గంటలకు సమయంలో టీజర్ బయటకు వస్తుందని  చెప్పారు. అలాంటి ఈ తరుణంలో టీజర్ గురించి 10 గంటల సమయంలో ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనిపై డైరెక్టర్ వశిష్ట ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం


 చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే వశిష్టాకు ఎంతో అభిమానమట. తన స్టైల్ ను అనుకరిస్తూ  ఉండేవాడినని చెప్పాడు. అయితే మెగా అభిమానులు చిరంజీవి నుంచి ఏమి కోరుకుంటారో ఆ అంశాలన్నీ విశ్వంభర సినిమాలో ఉన్నాయని అన్నారు. నేను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమానిని వెల్లడించారు. విశ్వంభర చిత్రంలో వింటేజ్ మెగాస్టార్ ని మీరంతా చూస్తారని, సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని తెలియజేశారు.

ఇదే తరుణంలో టీజర్ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి ఆయన స్పందించారు. మేము సినిమాకి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారమే ప్రచారం చేయాలని భావిస్తున్నాం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయడం లేదు. త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు. టీజర్ రిలీజ్ కి ముందే  టీజర్ విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఒకింత ఇది సినిమాకు ఎంతో ప్లస్ అవుతుందని చెప్పుకొచ్చారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu vishvambhara vasista

Related Articles