అలనాడు ప్రజల కోసం శ్రీరాముడు వారధి కట్టినట్టు చరిత్ర చెబుతోంది. కానీ ఈ కాలంలో ప్రజల అవసరాల కోసం కేవలం 16 గంటల్లోనే వారధి కట్టారు సోల్జర్స్. ప్రస్తుతం వారు కట్టిన వారధి సోషల్ మీడియా విపరీతంగా వైరల్
న్యూస్ లైన్ డెస్క్: అలనాడు ప్రజల కోసం శ్రీరాముడు వారధి కట్టినట్టు చరిత్ర చెబుతోంది. కానీ ఈ కాలంలో ప్రజల అవసరాల కోసం కేవలం 16 గంటల్లోనే వారధి కట్టారు సోల్జర్స్. ప్రస్తుతం వారు కట్టిన వారధి సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. దేశవ్యాప్తంగా వయనాడులో జరిగినటువంటి కొండ చరియలు విరిగిన ఘటన సంచలనంగా మారింది. ఇప్పటికే వందలాదిమంది మరణించారు.
కొండ చరియలు విరిగిపడడం వల్ల రోడ్లన్నీ మూసుకుపోయాయి కనీసం నడవడానికి కూడా ఎక్కడ ప్లేస్ లేదు. వెంటనే రంగంలోకి దిగినటువంటి భారత సైన్యం ఎంతోమంది క్షతగాత్రులను కాపాడుతూ ఆసుపత్రికి తరలిస్తోంది. అంతే కాకుండా శిథిలాల కింద ఉన్నటువంటి మృతదేహాలను బయటకు తీస్తూ వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తుంది. ఈ తరుణంలోనే భారత సైన్యం అక్కడ రాకపోకలు నిలిచిపోయిన వేలాది మంది ప్రజలను కాపాడేందుకు కేవలం 16 గంటల్లోనే ఒక వారధి నిర్మాణం పూర్తి చేసింది.
జూలై 31 రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మొదలైన వారిధి పనులు ఆగస్టు 1 సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల వరకు పూర్తి చేశారు. ఈ వారధి నిర్మాణాన్ని మేజర్ సీత షెల్కే అలాగే మేజర్ అనీష్ తో కలిసి కేవలం 16 గంటల్లో 190 అడుగుల పొడవు ఉన్న బ్రిడ్జి పూర్తి చేయడంతో వారి యొక్క కృషికి దేశవ్యాప్తంగా అభినందనలు దక్కుతున్నాయి. వంతెన నిర్మాణం కోసం సామాగ్రిని ఢిల్లీ మరియు బెంగళూరు నుంచి కర్నూలు విమానాశ్రయానికి తరలించి 17 టన్నుల బరువున్న వాటిని వాయనాడు తరలించారు సైన్యం.
అయితే ఈ వంతెన క్లాస్ 24బేయిలి వంతెన, ఇరువజింజిపూజ నదిపై ముండక్కాయితో చురాల్ మాలాను కలుపుతుంది. ఈ వంతేన 24 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఉంటుందట. నిర్మాణం పూర్తయిన తర్వాత కేరళ కర్ణాటక సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మాథ్యూ తన అధికారిక వాహనంతో వంతెనను దాటారు. దీని తర్వాత ఆర్మీ మెడికల్ ఆఫీసర్స్ మిలిటరీ ట్రక్ ఈ వంతెనగుండ వెళ్లి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అయితే ఈ వంతెన కేవలం 16 గంటల్లో పూర్తి చేసినందుకు సోల్జర్స్ కు దేశమంతా అభినందనలు తెలియజేస్తున్నారు. మరి మీరు కూడా సోల్జర్స్ అంటే ఇష్టపడితే తప్పక కామెంట్ చేయండి.