ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సుమ రాఖీ ఎవెన్యూస్ కు సంబంధించినటువంటి వార్త కనిపిస్తోంది. రాజమండ్రి కి చెందిన రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు ఎత్తేయడంతో
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సుమ రాఖీ ఎవెన్యూస్ కు సంబంధించినటువంటి వార్త కనిపిస్తోంది. రాజమండ్రి కి చెందిన రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు ఎత్తేయడంతో చాలామంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు. ఈ సంస్థ ద్వారా చాలామంది మధ్యతరగతి ప్రజలు పైసా పైసా కూడా బెట్టి సొంతింటి కల నెరవేర్చుకోవాలని లక్షల రూపాయలు సమర్పించుకుని మోసపోయారు.
అయితే ఈ సంస్థను ప్రోత్సహిస్తూ యాంకర్ సుమ మరియు భర్త రాజీవ్ కనకాల ప్రమోట్ చేశారు. ఇందులో మేము కూడా పెట్టుబడి పెట్టామని వారు చెప్పడంతో చాలామంది ప్రజలు నమ్మి రాఖీ అవెన్యూస్ లో పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ సంస్థ వారు బోర్డు తిప్పడంతో చాలామంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు. ఈ సంస్థపై మరియు సుమపై కేసు కూడా పెట్టారు. దీనిపై స్పందించినటు వంటి సుమ ఒక విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పింది.
2016 నుంచి 18 వరకు మాత్రమే నేను ఆ అవెన్యూస్ సంస్థకు ఒప్పందం చేసుకున్నానని ఆ తర్వాత ఒప్పందం రద్దయిందని అన్నారు. ఇప్పుడు వచ్చే ప్రకటనలు అనధికారమైనవని ఆమె తెలియజేశారు. తర్వాత నేనెప్పుడూ కూడా రాఖీ అవెన్యూస్ కి సంబంధించిన యాడ్లో కనిపించలేదని , కొంతకాలం తర్వాత పాత ప్రకటనలని టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయని ఇప్పటినుంచి అవి ప్రసారం చేయవద్దని ఆమె అన్నారు.
ఇప్పటికే నేను రాఖీ అవెన్యూస్ లో ఆస్తులు కొనుగోలు చేసిన వారి నుంచి లీగల్ నోటీసులు అందుకున్నానని, వాటిపై నేను సమాధానం కూడా ఇవ్వడం జరిగిందని, ఇందులో కొనుగోలు చేసిన వారి జాబితాను కూడా పరిశీలించామని ఆ సంస్థ వారిని కోరామని అన్నారు. మీ సమస్యను తీర్చేందుకు నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారు.
https://www.instagram.com/p/C-XZBpYJS7_/?igsh=Y25wMG1vOGJxaHRp