న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : రతన్ టాటా ఇక లేరు. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ ఈ మాటే చాలా కష్టంగా ఉంది. ఆ స్థానంలో రతన్ టాటా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఆయన తర్వాత ఆ స్థానం ఎవరికి అనేది ఇప్పుడు హాట్ టాపిక్. నిజానికి ఆస్తులకు వారసులు ఎవరని కాదు...ఆ ఛైర్ ఎవరి రతన్ టాటా తర్వాత జనాల కోసం అంత ఆలోచించే అవకాశం ఉందా ..అనేది నెటిజన్లు చాలా ఆత్రం గా ఎదురుచూస్తున్నారు.
.రతన్ టాటా పెళ్లి చేసుకోలేదనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే టాటా మరణం తర్వాత ఆయన టాటా గ్రూప్స్ సంస్థలకు అధినేత, వారసుడు ఎవరు అనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రతన్ టాటా చాలా దూరదృష్టి కలిగిన వ్యక్తి. నిజానికి, రతన్ టాటా.. ఇందుకు ఏర్పాట్లు ఎప్పుడో పూర్తి చేశారు. టాటా గ్రూప్‌కి ప్రస్తుతం ఎన్ చంద్రశేఖ టాటా సన్స్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2017 నుంచి ఆ బాధ్యతలు చేపడుతున్నారు. రతన్ టాటా హయాంలోనే ఆయన కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. టాటా గ్రూప్ ను వ్యాపార రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారు కూడా.
ఇక సిమోన్‌తో నావల్ టాటా రెండో భార్య కుమారుడు నోయెల్ టాటా.. రతన్ టాటా సవతి తల్లి కొడుకు . నోయల్ టాటా ఈ వారసత్వాన్ని అందుకొనే పోటీ లో ఉన్నారు. నోయల్ టాటా కు ముగ్గురు సంతానం మాయ, నెవిల్లే లేహ్ టాటా ..ఈ ముగ్గురు లీగల్ గా వారసులవుతారు. రతన్ టాటా ఎలాంటి డాక్యుమెంట్స్ రాయకుండా ఉంటే వీరు లీగల్ గా వారసులవుతారు.ఈ ముగ్గురు ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా టాటా గ్రూప్స్ కి చెందిన పలు వ్యాపారాలను చూసుకుంటున్నారు. అఫిషియల్ గా అనౌన్స్ చెయ్యాలి అంతే.