Devara: దేవరలో సైఫ్ అలీ ఖాన్ భార్యగా చేసిన బ్యూటీ ఎవరంటే.?

భారీ అంచనాల మధ్య విడుదలైన దేవర సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది అయితే దేవర సినిమాపై నెగటివ్ ప్రచారం చేశారు.కానీ మొదటి రోజే 172 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది దేవర మూవీ


Published Sep 28, 2024 05:11:31 PM
postImages/2024-09-28/1727523691_saif.jpg

న్యూస్ లైన్ డెస్క్: భారీ అంచనాల మధ్య విడుదలైన దేవర సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది అయితే దేవర సినిమాపై నెగటివ్ ప్రచారం చేశారు.కానీ మొదటి రోజే 172 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది దేవర మూవీ  అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్లను చిత్ర యూనిట్ అఫీషియల్ గా బయట పెట్టడంతో దేవర సునామి ఎలా ఉందో అభిమానులకు అర్థమైంది.

ఇక ఈ ఒక్క పోస్టర్ తో చాలామంది సినిమా చూడడానికి థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇక దేవర సినిమా గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఆది పురుష్ సినిమాతో తెలుగులోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్ అంత గుర్తింపు తెచ్చుకోలేదు  ఇక దేవర సినిమా ఈయనకు గుర్తింపుని ఇచ్చిందని అర్థమవుతుంది. అయితే ఈ మూవీలో ఒక బుల్లితెర నటి సైఫ్ కి భార్యగా నటించింది. ఆమె ఎవరో కాదు స్టార్ మా లో ప్రసారమై హిట్టు కొట్టిన అష్టాచమ్మా నటి చైత్ర రాయ్.

ప్రస్తుతం ఈ బుల్లితెర ఆర్టిస్ట్ జీ తెలుగులో రాధకు నీవేరా ప్రాణం సీరియల్ లో చేస్తోంది. అయితే అలాంటి చైత్ర బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో నటించి ఫేమస్ అయిపోయింది. ఇక ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలో నటించడం చైత్రా రాయ్ అదృష్టమే అని చెప్పుకోవచ్చు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr adipurush devara koratala-shiva saif-ali-khan

Related Articles