Saipallavi:సాయిపల్లవిని పెళ్లి చేసుకోమని టార్చర్ చేసింది ఎవరంటే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేయని  హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే సాయిపల్లవి పేరే ముందుగా గుర్తుకొస్తుంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ కెరియర్


Published Aug 22, 2024 12:57:00 PM
postImages/2024-08-22/1724309959_sai.jpg

న్యూస్ లైన్ డెస్క్:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేయని  హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే సాయిపల్లవి పేరే ముందుగా గుర్తుకొస్తుంది. అద్భుతమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో చేస్తోంది. ఈ చిత్రంలో సీత పాత్రలో సాయిపల్లవి మనల్ని అలరించనుంది.  అలాంటి సాయిపల్లవిని పెళ్లి చేసుకోమని టార్చర్ చేశారట. మరి వారెవరు ఆ వివరాలు చూద్దాం.

 సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన విషయాలను బయట పెట్టింది. తన పెళ్లి అంతా తన తల్లిదండ్రులే చూసుకుంటారని అన్నది. అంతేకాదు కరోనా సమయంలో  నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ టైంలో నన్ను మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని తీవ్రంగా టార్చర్ చేశారు. కజిన్ సిస్టర్స్ అందరికి పెళ్లి అయిపోవడం , సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాకపోవడం వల్ల  కరోనా మంచి సమయమని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారట.

దీంతో సాయి పల్లవి షాక్ అయిపోయిందట. ఇంకా నా కెరియర్ లో నేను అనుకున్నది ఏ మాత్రం సాధించలేదు. ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకోవాలని అనుకుందట. అలా కరోనా పీరియడ్ అయిపోయే వరకు ఆమె చాలా ఇబ్బంది పడిందట. ఇక కరోనా అయిపోయిన తర్వాత సినిమాల బిజీ వల్ల  తన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదట. అలా తన కెరియర్ లో అనుకున్నది సాధించేవరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ చేసుకుంటే తల్లితండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటానని సాయి పల్లవి చెప్పకనే చెప్పేసింది.  ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : news-line marraige, parents ramayanam saipallavi covid-time

Related Articles