సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు స్పృహ ఉండదు. ఎవరైనా గట్టిగా కదిపితే గాని నిద్రలేవం. ఒక్కోసారి నిద్రలో ఉండి బెడ్ పైనుంచి జారి కింద కూడా పడిపోతూ ఉంటాం. మనుషుల విషయంలో
న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు స్పృహ ఉండదు. ఎవరైనా గట్టిగా కదిపితే గాని నిద్రలేవం. ఒక్కోసారి నిద్రలో ఉండి బెడ్ పైనుంచి జారి కింద కూడా పడిపోతూ ఉంటాం. మనుషుల విషయంలో ఇలా ఉంటే పక్షులు కూడా రాత్రి సమయంలో నిద్రిస్తూ ఉంటాయి. ఆ టైంలో అవి చెట్టు కొమ్మలపై గట్టిగా పట్టుకుని నిద్రపోతూ ఉంటాయి. మరి అవి నిద్రలోకి జారుకున్నాక కింద పడిపోవా అనే అనుమానం చాలామందికి ఉండే ఉంటుంది. కానీ పక్షులు కొమ్మలపై నిద్ర పోయినా కానీ కింద పడిపోక పోవడానికి . కొన్ని కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
ఈ సమాజంలో మనిషికి అంతు పట్టని ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అందులో పక్షి కూడా ఒకటి. పక్షి రోజంతా గాల్లో దానికి సంబంధించిన ఆహారాన్ని తిని కడుపు నింపుకొని రాత్రి సమయంలో తన గూటికి చేరుకొని నిద్రిస్తుంది. అలా వెలుగున్న సమయంలో వేటకు వెళ్లి ఆహారం సంపాదించుకుని మళ్ళీ వచ్చి తన గూటి దగ్గర నిద్రపోతుంది. కొన్ని పక్షులు గూట్లో నిద్రపోతే మరికొన్ని పక్షులు చెట్ల కొమ్మలపై నిద్రిస్తూ ఉంటాయి. అవి చెట్టు కొమ్మలపై అలా నిద్రిస్తున్నప్పుడు నిద్రలోకి జారుకున్నాక ఎందుకు కింద పడవు అనేదానికి ఒక సమాధానం ఉంది. సాధారణంగా చాలా పక్షులు ఒక కన్ను మూసుకుని మరో కన్ను తెరిచి నిద్రపోతాయట.
నిద్రపోతున్న సమయంలో కూడా వాటి మెదడు చాలా చురుకుగా పనిచేస్తుందట. ఎందుకంటే ఒక కన్ను తెరిచి ఉంటుంది కాబట్టి అవి కింద పడిపోయే మూమెంట్ ఉంటే తొందరగా లేచి సెట్ చేసుకుంటాయట. ఇదే కాకుండా పక్షులకు పాదాల యొక్క ఆకృతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మన వేలుపై ఏదైనా చిన్న పక్షిని నిలబెట్టుకోండి. అది గట్టిగా మన వేలుని పట్టుకుని నిలబడుతుంది. ఆ విధంగానే చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుంటుందట. అలా కొమ్మలను బిగుతుగా తాళం వేసినట్టు పట్టుకోవడం వల్ల అవి నిద్రపోతున్నా కానీ కింద పడిపోవట.