పదిలక్షల కోట్లు నష్టానికి స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఎక్కడో ఇరాన్, ఇజ్రాయెల్ యుధ్ధమేఘాలు భారత్ స్టాక్ మార్కెట్ ను షేక్ చేశాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ రోజుపడిపోయినంత దారుణంగా ఎప్పుడు పడిపోలేదు. ఒక్కరోజు లో ఎన్నో వేల మంది రోడ్డున పడిపోయింటారు. పదిలక్షల కోట్లు నష్టానికి స్టాక్ మార్కెట్ పడిపోయింది. ఎక్కడో ఇరాన్, ఇజ్రాయెల్ యుధ్ధమేఘాలు భారత్ స్టాక్ మార్కెట్ ను షేక్ చేశాయి.
* భారత స్టాక్ మార్కెట్ ఇంట్రాడేలో దాదాపు 9.78 లక్షల కోట్ల రూపాయలను తుడిచిపెట్టుకుపోయింది.
* బీఎస్ఈలో లిస్టైన అన్ని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.4,74.86 లక్షల కోట్ల నుంచి రూ.4,65.07 లక్షల కోట్లకు పడిపోయింది.
*మార్కెట్ క్యాప్ రూ.10.5 లక్షల కోట్లకు పడిపోయింది. బీఎస్ఈలో 2,881 షేర్లు ఎరుపు రంగులో ముగియగా, 1,107 షేర్లు ఆకుపచ్చ రంగులో ముగిశాయి.
ఇలా ఒక్కటి కాదు దాదాపు అన్ని షేర్లు రెడ్ లోనే నడిచాయి. 10లక్షల కోట్లు సింగిల్ డే లో ఆవిరైపోయాయి.
ముడి చమురు ధరలు పెరగడం, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎఫ్ అండ్ ఓ విభాగంలో కొత్తగా నిబంధనలను తీసుకురావడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల అమ్మకాలు వంటి ఇతర అంశాలన్నీ ఈ రోజు స్టాక్ మార్కెట్ పడిపోవడానికి కారణమయ్యాయి.