Trisha:స్టార్ నటి త్రిష  ఆస్తుల విలువ తెలిస్తే షాకే.?

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో  నటి త్రిష అంటే తెలియని వారు ఉండరు. అలాంటి  ఈమె ఇప్పటికీ వరకు ఎన్నో చిత్రాలు నదించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు తెలుగులో


Published Aug 11, 2024 03:50:00 PM
postImages/2024-08-11/1723369750_trisha.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  నటి త్రిష అంటే తెలియని వారు ఉండరు. అలాంటి  ఈమె ఇప్పటికీ వరకు ఎన్నో చిత్రాలు నదించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు తెలుగులో అత్యంత క్రేజ్ తీసుకువచ్చిన చిత్రం వర్షం అని చెప్పవచ్చు.  ఈ మూవీ ద్వారానే త్రిష తెలుగు ఇండస్ట్రీలో స్టార్ గా మారింది. ఈ చిత్రం తర్వాత ఈమెకు అనేక వరుస ఆఫర్లు వచ్చాయి.

 అలాంటి త్రిష కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకొని దూసుకుపోతోంది. అయితే తాజాగా త్రిష  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పోన్నియన్ సెల్వన్ చిత్రంలో  నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ విధంగా హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రలో కూడా నటిస్తూ దూసుకుపోతుందట. అలాంటి ఈమె భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. హీరోలతో సమానంగా తీసుకుంటుందట.

సాధారణంగా ఒక్కో సినిమాకు ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాలే కాకుండా పలు సోషల్ యాడ్స్ ద్వారా కూడా ఆమె రెండు చేతుల సంపాదిస్తుందట. ఇలా త్రిష తన కెరియర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వందలాది కోట్లు వెనకేసినట్టు తెలుస్తోంది. ఇక త్రిష స్థిర,చర ఆస్తుల విలువ  దాదాపు 100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

 త్రిషకు చెన్నైలో విలువైన అపార్ట్మెంట్లు, హైదరాబాదులో విలాసవంతమైన బంగ్లాలు స్థలాలు ఉన్నాయట. ఈమెకు ముంబైలో కూడా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ ఆస్తులన్నీ కలిపి  100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. త్రిష ఇంత సంపాదించినా కానీ ఇప్పటికీ 40 ఏళ్లు దాటిన పెళ్లి మాత్రం చేసుకోవడం లేదని ఆమె అభిమానులు బాధపడిపోతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line trisha ponniyan-selvan praperties varsham

Related Articles