ప్రతి యేడాది అక్టోబర్ 9 వ తేదీని అంతర్జాతీయ తపాలా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇఫ్పుడు వాట్సాప్ నే చూడడం లేదు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అవును ..తోక లేని పిట్ట తొభై ఊర్లు తిరుగుతుందని అనే వాళ్లు .. ఉత్తరం మీద అంత మోజు ఉండేది. ఐక్యరాజ్యసమితి చేపట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి యేడాది అక్టోబర్ 9 వ తేదీని అంతర్జాతీయ తపాలా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇఫ్పుడు వాట్సాప్ నే చూడడం లేదు. ఇక తపాలా ...ఉద్యోగాలు పోస్టింగ్ ఆర్డర్లు ..ఇలాంటివే కాని పర్సనల్ మెసేజ్ లు పంపడం ఎప్పుడో ఆగిపోయాయి. కాని ఇంకా తపాలా పై దేశం చాలా పనులు చేస్తుంది. ఇప్పటి సంగతి దేనికి అప్పట్లో మనం రాసిన చిలిపి ఉత్తరాలు గర్తు చేసుకుందాం.
చిన్నప్పటి పాఠశాల రోజుల్లో పుస్తకాల్లో రాసిన హెడ్‌మాస్టర్‌కు సెలవు చీటీ..
సరదాగానో...లేక పిల్లతనంతోనో ...రాసే ఊంటాం ..ప్రేమలేఖలు
ఖర్చుల కోసం అమ్మనాన్నను డబ్బులడుగతూ లేఖ
ఉద్యోగం కోసం చేసే దరఖాస్తుకు అంటించే తపాలా బిళ్ళలు... ఇలా ఎన్నెన్నో విషయాలను వెల్లడించారు. కొంతవరకు తెలీదని చెప్పలేరు. మీరు ప్రయత్నించకపోయినా ..వినే ఉంటాం.లేదా చూసే ఉంటాం ఈ రోజు తపాలా దినోత్సవం. ఎన్నో యేళ్లు మన అవసరాలు తీర్చిన తపాలా ను గుర్తు చేసుకుందాం.
ఇక యువతరాన్ని కదిలించగా... ఇ-మెయిల్, ఎస్ఎంఎస్‌లకే తమ తొలి ప్రాధాన్యతగా వెల్లడించారు. నిజానికి టెక్నాలజీ వాడి వాడి వాటి మీద కూడా విరక్తి పుట్టేసింది . కాని లేఖల పై ఇంకా ఆ ప్రేమ మాత్రం ఉంది. ఎంతో మంది ఉత్తరాలు దాచుకొని మురిసిపోయేవారు. ఎప్పుడో వచ్చే ఉత్తరానికి వేల కళ్లతో ఎదురు చూసేవాళ్లం ...ఇప్పుడు క్షణాల్లో వచ్చేయడం వల్లో ఏంటో మనసు కు మాత్రం ఆప్తులెవ్వరు లేరు. మరో సారి గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ తపాలా దినోత్సవం.