Kalki :కల్కి టికెట్ బుక్ చేస్తున్నారా...కల్కి ఏ సినిమానో చెక్ చేసుకొండి సుమా !

మరో రెండు రోజుల్లో కల్కీ 2898ఏడీ (Kalki 2898 Ad) విడుదలపై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి. టికెట్ రేటు కూడా పెంచుతున్నారు. అయితే ఈ టైంలోనే కల్కీ కి పెద్ద స్కెచ్ వేశారు మరో హీరో. ఎవరంటారా ...ఈ సినిమా సందట్లో మెల్లగా మార్కెట్‌లోకి వచ్చింది రాజశేఖర్‌ నటించిన కల్కి సినిమా. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్‌ అయ్యింది. టికెట్లు అయిపోతాయేమో అని తొందరలో కొందరు ప్రభాస్‌(Prabhas) కల్కి మూవీ టికెట్లను బుక్‌(Ticket Bookings) చేసుకో


Published Jun 24, 2024 01:49:19 PM
postImages/2024-06-24/1719217159_kalkirajasekhar24062024c.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మరో రెండు రోజుల్లో కల్కీ 2898ఏడీ (Kalki 2898 Ad) విడుదలపై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి. టికెట్ రేటు కూడా పెంచుతున్నారు. అయితే ఈ టైంలోనే కల్కీ కి పెద్ద స్కెచ్ వేశారు మరో హీరో. ఎవరంటారా ...ఈ సినిమా సందట్లో మెల్లగా మార్కెట్‌లోకి వచ్చింది రాజశేఖర్‌ నటించిన కల్కి సినిమా. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్‌ అయ్యింది. టికెట్లు అయిపోతాయేమో అని తొందరలో కొందరు ప్రభాస్‌(Prabhas) కల్కి మూవీ టికెట్లను బుక్‌(Ticket Bookings) చేసుకోగా.. వారికి హీరో రాజశేఖర్‌(Rajasekhar) నటించిన కల్కి(Kalki) సినిమా టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు .


కల్కీ అని చూడగానే ...టికెట్ బుకింగ్ చేసేస్తున్నారు. అయితే అది రాజశేఖర్ సినిమానా ...లేక ...ఈ సినిమానా చూడడం లేదని చెబుతున్నారు.ఈ సమస్యను పలువురు ఫేస్‌ చేయడంతో ఈ సంగతి ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది. బుక్‌ మై షో ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న పలువురికి ఈ చేదు అనుభవం ఎదురైంది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఇలా టికెట్లు(Tickets) బుక్‌ అవుతున్నట్లు ఆ వెబ్‌సైట్ తెలిపింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. 


రాజశేఖర్‌ కల్కి టికెట్లు చూపించినా కల్కి 2898ఏడీ టికెట్‌లాగే పరిగణిస్తామని తెలిపింది. ఏ టికెట్‌ చూపించి అయినా ప్రభాస్‌(Prabhas) కల్కి చూడవచ్చంటూ తేల్చింది. దీంతో అభిమానులు కాస్త కుదుట పడ్డారు. ఈ విషయంపై రాజశేఖర్ స్పందించారు. అంతేకాదు ...ఈ టికెట్ల గోల గాని రిలీజ్ గోల కాని తనకు అసలు తెలీదని తెలిపారు.  బుక్ మై షో కల్కి టికెట్ బుకింగ్ గురించి తెలిసిందని తన కల్కి టికెట్లు చూపిస్తే ప్రభాస్ సినిమాకు వెళ్లొచ్చని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : kalki-tickets kalki-movie rajshekar book-my-show

Related Articles